రిలయన్స్ క్యాపిటల్ బోర్డులోకి అనిల్ అంబానీ కుమారుడు | Anil Ambani's elder son Jai Anmol joins Reliance Capital board | Sakshi
Sakshi News home page

రిలయన్స్ క్యాపిటల్ బోర్డులోకి అనిల్ అంబానీ కుమారుడు

Aug 24 2016 12:59 AM | Updated on Sep 4 2017 10:33 AM

రిలయన్స్ క్యాపిటల్ బోర్డులోకి అనిల్ అంబానీ కుమారుడు

రిలయన్స్ క్యాపిటల్ బోర్డులోకి అనిల్ అంబానీ కుమారుడు

బిలియనీర్ అనిల్ అంబానీ పెద్ద కుమారుడు జై అన్మోల్ తాజాగా రిలయన్స్ క్యాపిటల్ బోర్డులో అడిషనల్ డెరైక్టర్‌గా నియమితులయ్యారు.

న్యూఢిల్లీ: బిలియనీర్ అనిల్ అంబానీ పెద్ద కుమారుడు జై అన్మోల్ తాజాగా రిలయన్స్ క్యాపిటల్ బోర్డులో అడిషనల్ డెరైక్టర్‌గా నియమితులయ్యారు. ఈయన నియామకానికి బోర్డు ఆమోదం తెలిపింది. 24 ఏళ్ల ఈ యువ డైనమైట్ గత రెండేళ్లుగా రిలయన్స్ క్యాపిటల్‌లోని పలు ఫైనాన్షియల్ సర్వీసెస్‌లకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.

ఈయన యూకేలోని వర్విక్ బిజినెస్ స్కూల్ నుంచి డిగ్రీ పొందారు. ‘గత రెండేళ్లలో ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్‌లకు సంబంధించి చాలా నేర్చుకున్నాను. ఈ అనుభవంతో కంపెనీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తాను’ అని జై అన్మోల్ తెలిపారు. రిలయన్స్ క్యాపిటల్.. లైఫ్ ఇన్సూరెన్స్, కమర్షియల్ ఫైనాన్స్, సెక్యూరిటీస్, జనరల్ ఫైనాన్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వ్యాపారాలను నిర్వహిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement