ఓ మ్యాన్‌..నా వీకెండ్‌ మొదలైంది

Anand Mahindra shares video of boy dancing on anti-theft bike alarm - Sakshi

సాక్షి,ముంబై : మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మరో ఆసక్తికరమైన ఫన్నీ వీడియోను షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే  ఆయన  తాజాగా ఒక బుడ్డోడి వీడియోను  తన  ట్విట్టర్లో  పోస్ట్‌  చేశారు. నేనైతే..పగలబడి నవ్వుతున్నా..అంటూ ఓ బుడ్డోడి రోబో లాంటి డ్యాన్స్‌ వీడియోను మహీంద్రా షేర్ చేశారు.  

విషయమేమిటంటే...సాధారణంగా బైక్‌లు, కార్లను ఎవరైనా టచ్‌  చేస్తే..యాంటీ థెప్ట్ అలారం మోగడం, ఆ అలారం చేసే గొడవ మనకు తెలిసిందే.  అయితే.. ఓ బుడ్డోడు.. తన దారిన పోతూ ఓ సూపర్ బైక్‌ను చూశాడు.  ఎంతైనా క్రేజీ బుడ్డోడు కదా. (దాన్ని ముట్టుకోగానే అలారం మోగుతుందని తెలుసో లేదో...తెలియదు గానీ)  దాన్ని ఒక తన్ను తన్నాడు. అంతే ఇక రచ్చమొదలైంది.  ఆ అలారం సౌండ్‌కు తగినట్టుగా బుడ్డోడు అచ్చం రోబోలా మెలికలు తిరిగిపోతూ డ్యాన్స్  చేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా  తన వస్తువులు తాను తీసుకొని అమాయకంగా జారుకున్నాడు.  ఆ విన్యాసాలు మాటల్లో చెప్పడం కష్టం... చూసి తీరాల్సిందే.  అందుకే ఆనంద్‌ గోపాల్‌ మహీంద్ర కూడా ఫిదా అయిపోయారు. తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు.

ఇంతవరకూ ఇలాంటి ఫన్నీ వీడియోను చూడలేదు. ఈ పిల్లాడి రోబో డ్యాన్స్ చూసి కడుపుబ్బా నవ్వుకున్నాను.  ఇంకా నవ్వును ఇంకా ఆపుకోలేకపోతున్నాను. ఇక నా వీకెండ్ మొదలైందంటూ ట్వీట్‌ చేశారు. ఏమైనా పిల్లలు పిడుగులబ్బా..వారి క్రియేటివిటికీ..ఆహా...! అనాల్సిందే. మరిలేకపోతే..వార్నింగ్‌ అలారం శబ్దాలకు కూడా ఇలా డ్యాన్స్‌ ఇరగదీయవచ్చని మనం ఊహించగలమా. ఇంకా ఊహలెందుకు..మన బుల్లి హీరోగారి డాన్స్‌తో వీకెండ్‌ను  హుషారుగా  ఆరంభించండి!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top