స్టాక్ మార్కెట్ పాఠాలకు గేమింగ్ యాప్ | An app to help you learn how the stock market works | Sakshi
Sakshi News home page

స్టాక్ మార్కెట్ పాఠాలకు గేమింగ్ యాప్

Jun 6 2016 12:46 PM | Updated on Sep 4 2017 1:50 AM

స్టాక్ మార్కెట్ల ప్రయాణంలో మార్గదర్శి కావలనుకునే యూజర్లకు పాఠాలు నేర్పడానికి టోరో ఈ ఓర్సో(బుల్ అండ్ బేర్) అనే మొబైల్ గేమ్ యాప్ ను ప్రముఖ ఫైనాన్సియల్ కంపెనీ హెడ్జ్ ఈక్విటీస్ ఆవిష్కరించింది.

కొచ్చి : మొబైల్ వినియోగం పెరుగుతున్నా కొద్దీ యాప్ ల ఆవిష్కరణలు దూసుకెళ్తున్నాయి. ప్రతి చిన్న పనికోసం, సమాచారం తెలుసుకోవడం కోసం యూజర్లకు యాప్ లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో కొత్త యాప్ యూజర్ల ముందుకు వచ్చింది. స్టాక్ మార్కెట్ల ప్రయాణంలో మార్గదర్శి కావలనుకునే యూజర్లకు పాఠాలు నేర్పడానికి టోరో ఈ ఓర్సో(బుల్ అండ్ బేర్) అనే మొబైల్ గేమ్ యాప్ ను ప్రముఖ ఫైనాన్సియల్ కంపెనీ హెడ్జ్ ఈక్విటీస్ ఆవిష్కరించింది.

చాలామంది యువత మార్కెట్లో పెట్టుబడులు పెడదామనకుని, అవి ఎలా వర్క్ చేస్తున్నాయో తెలియక సతమతమవుతుంటారని ప్రముఖ ఫైనాన్సియల్ సర్వీసు కంపెనీ హెడ్జ్ ఈక్విటీస్ మేనేజింగ్ డైరెక్టర్ అలెక్స్ కె. బాబు తెలిపారు. స్టాక్ ట్రేడింగ్ ల గురించి సులభంగా తెలుసుకునేలా ఈ యాప్ ను రూపొందించినట్టు పేర్కొన్నారు. షేర్ ట్రేడింగ్ లో బేసిక్స్ గురించి యువతకు తెలపడానికి యాప్ లు, గేమ్ లే ఉత్తమ మార్గమని అలెక్స్ అన్నారు. గేమ్స్ ద్వారా మార్కెట్ల గురించి యువత చాలా త్వరగా అర్థం చేసుకోగలుగుతారని పేర్కొన్నారు.

ఆండ్రాయిడ్ ఆధారిత ఈ గేమ్, బిగినెర్, అమాట్యూర్, ప్రొఫెసినల్ అనే మూడు లెవల్స్ ను కలిగి ఉంటుంది. బిగినెర్ లెవల్ లో 10 రౌండ్లు, అమాట్యూర్ లెవల్ లో 20, ప్రొఫెసినల్ లెవల్ లో 40 రౌండ్లు ఉంటాయి. ఈ గేమ్ లో యూజర్లు వర్చువల్ గా రూ.5వేల మొత్తాన్ని పొందుతారు. ఆ మొత్తాన్ని ఆయిల్, గ్యాస్, టెలికాం, ఎఫ్ఎమ్సీజీ, ఆటోమొబైల్, రియాల్టీ, ఫార్మా, పవర్, ఐటీ, మెటల్, బ్యాంకింగ్ వంటి దేనిలోనైనా పెట్టుబడి పెట్టొచ్చు. రాట్నంలో ఉన్న ఓ సెక్టార్ ను మార్క్ చేయాల్సి ఉంటుంది. ఈ రాట్నంలో ఉన్న చాన్స్ కార్డ్స్ లు, సెక్టార్లలో పాజిటివ్ గాని , నెగిటివ్ గా గాని ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఉదా..ఒకవేళ ఎఫ్ఎమ్ సీజీ సెక్టార్ లో ప్లేయర్ పెట్టుబడి పెట్టి, లోటు రుతుపవనాల్లో చాన్స్ కార్డ్ ను కలిగిఉంటే, ప్లేయర్ 100 పాయింట్లు నష్టపోవాల్సి ఉంటుంది. ప్రతి చాన్స్ కార్డ్ అనంతరం స్కోర్లు డిస్ ప్లే చేస్తుంది. ప్రతి లెవల్ తర్వాత మాక్రో కార్డ్ ను వస్తుంటుంది.  ఇలా అన్ని రౌండ్లు ముగించుకున్నాక లాభాలకు, నష్టాలకు మధ్య తేడాను స్కోర్ బోర్డు చూపిస్తుంది. ఇలా గేమింగ్ విధానం ద్వారా స్టాక్ మార్కెట్లు ఎలా పెట్టుబడులు పెట్టాలో నేర్పుతామని అలెక్స్ పేర్కొన్నారు.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement