ఫెడ్‌ నిర్ణయం, క్యూ4పై మార్కెట్‌ దృష్టి

American Federal Reserve Meeting on Tuesday and Wednesday - Sakshi

వడ్డీ రేట్ల నిర్ణయంపై మంగళ, బుధవారాల్లో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం

అంబుజా, కొటక్‌ మహీంద్రా బ్యాంక్, హెచ్‌యూఎల్‌ ఫలితాలు ఈవారంలోనే..

స్థూల ఆర్థికాంశాలు, ముడిచమురు ధరలు, రూపాయి కదలికలపై ఫోకస్‌

ఈ వారంలో ట్రేడింగ్‌ 3 రోజులకే పరిమితం

ముంబై: లోక్‌సభకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండగా.. ఈ క్రమంలో సోమవారం నాలుగో దశ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే మూడు దశలు పూర్తవగా.. నేడు జరిగే పోలింగ్‌...ఎన్నికల చివరి అంకానికి దగ్గర చేస్తుందనే అంశం మార్కెట్లో కీలకంగా ఉందని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ అన్నారు. ‘ఫలితాల వెల్లడి తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. తరువాత ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేయనున్నాయనే ఉత్కంఠ మార్కెట్లో పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో మే 23 వరకు ఒడిదుడుకులు కూడా మరింత పెరుగుతాయి’ అని అన్నారయన. కొనసాగుతున్న పోలింగ్, కార్పొరేట్‌ కంపెనీల తొలిత్రైమాసిక ఫలితాలు ఈవారంలో మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధన విభాగం హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు. ‘ఇప్పటివరకు వెల్లడైన కంపెనీల ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఇకపై వెల్లడికానున్న కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా ఉండి.. ఇదే సమయంలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తే మాత్రం సమీపకాలంలోనే మన మార్కెట్లు అవుట్‌పెర్ఫార్మ్‌ చేస్తాయి’ అని వ్యాఖ్యానించారు.  

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ ఫలితాల వెల్లడి
అంబుజా సిమెంట్స్, కొటక్‌ మహీంద్రా బ్యాంక్, కెన్‌ ఫిన్‌ హోమ్స్, టీవీఎస్‌ మోటార్‌ కంపెనీలు గత ఆర్థిక సంవత్సర(2018–19) చివరి త్రైమాసిక ఫలితాలను మంగళవారం (30న) ప్రకటించనున్నాయి. ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలైన బ్రిటానియా (బుధవారం), డాబర్‌ (గురు), హిందూస్తాన్‌ యూనిలివర్‌ (శుక్ర) ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇక ఇదేవారంలో రిజల్స్‌ ప్రకటించనున్న ఇతర ప్రధాన కంపెనీల్లో.. టాటా కెమికల్స్, టాటా పవర్, ఫెడరల్‌ బ్యాంక్, గోద్రేజ్‌ ప్రాపర్టీస్, అజంతా ఫార్మా, ఎల్‌ఐసి హౌసింగ్‌ ఫైనా¯Œ్స, రేమండ్, బంధన్‌ బ్యాంక్, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌లు ఉన్నాయి. ఈ ఫలితాలు మార్కెట్‌ ట్రెండ్‌కు అత్యంత కీలకంకానున్నాయని ఎడెల్వీజ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ సాహిల్‌ కపూర్‌ అన్నారు.

ఫెడ్‌ సమావేశంపై మార్కెట్‌ ఫోకస్‌
వడ్డీ రేట్లను సమీక్షించేందుకు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఈవారంలోనే సమావేశంకానుంది. మంగళ, బుధవారాల్లో ఫెడరల్‌ ఓపె¯Œ  మార్కెట్‌ కమిటీ ఈ అంశంపై చర్చించనుండగా.. ఈ సమావేశానికి సంబంధించిన తుది నిర్ణయాన్ని ఫెడరల్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ బుధవారం ప్రకటించనున్నారు.  

భారీ ఒడిదుడుకుల మధ్య క్రూడాయిల్‌
గతవారంలో 75 డాలర్లకు సమీపించి మార్కెట్‌కు ప్రతికూలంగా మారిన బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌.. వారాంతాన దిగొచ్చింది. శుక్రవారం 71.63 డాలర్ల వద్ద ముగిసింది. ఈ అంశం ఆధారంగా డాలరుతో రూపాయి మారకం విలువ 69.50–70.30 శ్రేణిలో ఉండేందుకు అవకాశం ఉందని ఎడిల్‌వీస్‌ సెక్యూరిటీస్‌ ఫారెక్స్‌ హెడ్‌ సజల్‌ గుప్తా విశ్లేషించారు.

ఈ వారంలో ట్రేడింగ్‌ 3 రోజులే..
ముంబైలో సార్వత్రిక ఎన్నికలు పోలింగ్‌ ఉన్న కారణంగా సోమవారం(29న) స్టాక్‌ ఎక్సే్ఛంజీలు సెలవు ప్రకటించాయి. ఆ తరువాత రోజైన మంగళవారం యథావిధిగా మార్కెట్‌ కొనసాగనుంది. అయితే, మళ్లీ బుధవారం(1న) మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా బీఎస్‌ఈ, ఎ¯Œ ఎస్‌ఈలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా ఈ వారంలో మార్కెట్లో ట్రేడింగ్‌
మూడు రోజులకే పరిమితంకానుంది

కొనసాగుతున్న విదేశీ నిధుల వెల్లువ
భారత్‌ క్యాపిటల్‌ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారీగా పెట్టుబడులు చేసిన విదేశీ ఇన్వెస్టర్లు ఏప్రిల్‌ 1–26 కాలంలోనూ రూ.17,219 కోట్లను పెట్టుబడిపెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top