ప్రముఖ కార్డియాలజిస్ట్‌ను నియమించుకున్న అమెజాన్‌

Amazon Hires A Star Cardiologist To Help Its Push Into Health - Sakshi

అమెజాన్‌ అంటే ప్రపంచ ఈ-కామర్స్‌ మార్కెట్‌లో ఓ సంచలనం. ఈ కంపెనీ కన్ను ఇప్పుడు 3 ట్రిలియన్‌ డాలర్ల హెల్త్‌ కేర్‌ రంగంపై పడింది. హెల్త్‌ కేర్‌ రంగంలోనూ తన సత్తా ఏమిటో నిరూపించుకోవాలనుకుంటోంది. ఈ క్రమంలో భాగంగా ప్రముఖ కార్డియాలజిస్ట్‌ మౌలిక్‌ మజ్ముదార్‌ను నియమించుకుంది. అమెజాన్‌లో తనను నియమించుకున్నట్టు తెలుపుతూ.. మజ్ముదార్‌ తన ట్విటర్‌ అకౌంట్‌లో కొత్త రోల్‌ గురించి ప్రకటించారు. ఈ టెక్నాలజీ కంపెనీ మజ్ముదార్‌ను  నియమించుకోకముందు, మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లో హెల్త్‌ కేర్‌ ట్రాన్సఫర్మేషన్‌ ల్యాబ్‌కు కార్డియాలజిస్ట్‌గా, అసోసియేట్‌ డైరెక్టర్‌గా ఆయన వ్యవహరించేవారు. ఎంఐటీలో లెక్చరర్‌ కూడా. ల్యాబ్‌లో ఆయన అధునాతన మెడికల్‌ టెక్నాలజీస్‌ను ఔషధాల్లో ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలపై పరిశోధనలు చేసేవారు. అయితే అమెజాన్‌లో ఆయన కొత్త ఏ బాధ్యతలను నిర్వర్తించనున్నారో మాత్రం వెల్లడించలేదు. కేవలం ఉత్తేజకరమైన, సవాల్‌తో కూడిన బాధ్యతలను తాను స్వీకరించనున్నట్టు మాత్రమే పేర్కొన్నారు. 

ఇప్పటికే హెల్త్‌కేర్‌లో కూడా పలు టీమ్స్‌తో అమెజాన్‌ పనిచేస్తోంది. మెడిసిన్లను హాస్పిటల్స్‌కు, క్లినిక్స్‌కు అమ్మేలా ఓ బిజినెస్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని అమెజాన్‌ యోచిస్తున్నట్టు తెలిసింది. హెల్త్‌ కేర్‌ కంపెనీలకు ఏఐ ఆధారిత టెక్నాలజీస్‌, ఇతర అధునాతన టెక్నాలజీలను తన క్లౌడ్‌ టీమ్‌ విక్రయించబోతున్నట్టు సమాచారం. హెల్త్‌ కేర్‌లో వాయిస్‌ అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి అలెక్సాలో ఓ మంచి బృందమే పనిచేస్తుంది. జూన్‌లో అమెజాన్‌ ఆన్‌లైన్‌ ఫార్మసీ పిల్‌ప్యాక్‌ను కూడా కొనుగోలు చేసింది. తన ఉద్యోగులకు వైద్య ఖర్చులు తగ్గించడానికి ఈ కంపెనీ, జేపీ మోర్గాన్‌, బెర్క్ షైర్ హాత్వేలతో భాగస్వామ్యం కూడా ఏర్పరుచుకుంది. ప్రస్తుతం హెల్త్‌ కేర్‌పై కన్నేసిన టెక్నాలజీ కంపెనీల్లో కార్డియాలజిస్ట్‌లకు భారీ డిమాండ్‌ ఉంది. దిగ్గజ టెక్‌ కంపెనీలు అమెజాన్‌, గూగుల్‌, ఆపిల్‌ కంపెనీలు వీరి నియామకాలపై ఎక్కువగా దృష్టి సారించాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top