టాప్‌లో అమెజాన్‌, గూగుల్‌: మరి ఆపిల్?

Amazon, Google lead global smart speaker market, Apple fourth - Sakshi

లండన్‌:  స్మార్ట్‌ స్పీకర్ల ఎగుమతుల్లో దిగ్గజ కంపెనీలు అమెజాన్, గూగుల్  టాప్‌​ ప్లేస్‌లో నిలిచాయి.  2018 మొదటి త్రైమాసికంలో  స్మార్ట్ స్పీకర్ల ఎగుమతుల్లో ఈ రెండు కంపెనీలు 70 శాతం వాటాను  సాధించాయి.  శుక్రవారం  వెల్లడైన తాజా నివేదిక ప్రకారం ఈ   సెగ్మెంట్లో ఆపిల్‌​ నాలుగవ స్తానంలో నిలిచింది.   ఆపిల్‌  600,000 హోమ్ పాడ్లను విక్రయించినట్లు తాజా నివేదిక వెల్లడించింది.

మార్కెట్ పరిశోధనా సంస్థ స్ట్రాటజీ ఎనలిటిక్స్ ప్రకారం మొదటి త్రైమాసికంలో గ్లోబల్ స్మార్ట్ స్పీకర్ల  ఎగుమతులు  9.2 మిలియన్ యూనిట్లు చేరుకున్నాయి. 43.6 శాతం మార్కెట్ వాటాతో అమెజాన్  నాలుగు మిలియన్ల  స్పీకర్లు షిప్‌మెంట్‌ చేసి టాప్‌ ప్లేస్‌ను కొట్టేసింది. నాలుగు మిలియన్ల  స్పీకర్లు షిప్‌మెంట్‌ చేసింది. అయితే   2017 ఏడాదితో పోలిస్తూ గ్లోబల్ మార్కెట్ వాటా  ఈఏడాది బాగా  తగ్గింది. గూగుల్ 2.4 మిలియన్ల విక్రయాలతో 26.5 శాతం వాటాను కొల్లగొట్టి రెండవ స్థానంలో నిలిచింది. చైనా ఇ-కామర్స్ జెయింట్ ఆలీబాబా  7.6 శాతం మార్కెట్ వాటాతో మూడవ స్థానానికి చేరుకుంది.  కాగా, ఆరు శాతం వాటా కలిగిన ఆపిల్ ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అతిపెద్ద స్మార్ట్ స్పీకర్ బ్రాండ్‌గా నిలిచింది. 70 శాతం వాటాతో టాప​ ప్లేస్‌లో ఉన్నప్పటికీ  మొత్తం వాటా గత ఏడాది ఇదే క్వార్టర్లోని 94 శాతంతో పోలిస్తే  84 శాతానికి పడిపోయింద ని డేవిడ్ వాట్కిన్స్  వెల్లడించారు.  అలాగే చైనాలో అలీబాబా, షావోమీ దేశీయంగా పుంజుకోడంతో పాటు, గ్లోబల్‌గా  టాప్‌ ఫైవ్‌ లోకి  దూసుకువచ్చాయని  వ్యాఖ్యానించారు. కీబోర్డ్‌, మౌస్‌, టచ్‌  స్క్రీన్‌ స్థానంలో వాయిస్ మోడ్‌  ఇంటరాక్షన్ టెక్నాలజీ  అందుబాటులోకి వచ్చే సమయం ఎంతో దూరంలో లేదన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top