ఆకాశ్‌ అంబానీ భావోద్వేగ ప్రసంగం : వైరల్‌ | Akash Ambani Makes An Emotional Speech For Sister Isha | Sakshi
Sakshi News home page

ఆకాశ్‌ అంబానీ భావోద్వేగ ప్రసంగం : వైరల్‌

May 10 2018 12:58 PM | Updated on May 10 2018 2:32 PM

Akash Ambani Makes An Emotional Speech For Sister Isha - Sakshi

ముంబై : బిలీనియర్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ వివాహం, బిజినెస్‌ టైకూన్‌ అజయ్‌ పిరమల్‌ కుమారుడు ఆనంద్‌ పిరమల్‌తో నిశ్చయమైన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఇషా, ఆనంద్‌ల ఎంగేజ్‌మెంట్‌ పార్టీని ముఖేష్‌ అంబానీ ఫ్యామిలీ గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసింది. ఈ వేడుకకు బాలీవుడ్‌ ప్రముఖులు, క్రికెట్‌ దిగ్గజాలు హాజరయ్యారు. ఇషా అంబానీ ఎంగేజ్‌మెంట్‌ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో ఫుల్‌గా షేర్‌ అవుతున్నాయి. తల్లి నీతా అంబానీ, తండ్రి ముఖేష్‌తో ఇషా వేసిన స్టెపులు, బాలీవుడ్‌ దిగ్గజాలతో దిగిన ఫోటోలు ఇంటర్నెట్‌లో మంచి వ్యూస్‌ను సంపాదించుకుంటున్నాయి. తాజాగా అంబానీ బ్రదర్లు ఆకాశ్‌, ఆనంత్‌లు సోదరి ఇషా, బావ ఆనంద్‌తో కలిసి ఉన్న ఓ వీడియో వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోలో ఆకాశ్‌ అంబానీ తన సోదరి ఇషా కోసం భావోద్వేగ ప్రసంగాన్ని ఇచ్చారు. అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని ఆయన ఈ వీడియోలో ఎంతో అద్భుతంగా వివరించారు. ఇషా అంబానీ ఎంగేజ్‌మెంట్‌ పార్టీలో ఆకాశ్‌ ఈ ప్రసంగమిచ్చారు. అంతకముందు ఇషా అంబానీ కూడా ఆకాశ్‌ అంబానీ, శ్లోకా మెహతా నిశ్చితార్థ సమయంలో తన కాబోయే వదినను ఎంతో ఆత్మీయంగా స్వాగతం పలికారు. కొన్ని రోజుల క్రితమే ఆకాశ్‌, శ్లోకాల నిశ్చితార్థం కూడా జరిగింది. కుదిరితే ఈ ఇరు జంటల వివాహం ఒకేసారి అంబానీ కుటుంబం నిర్వహించనుంది. కవలలైన ఇషా, అంబానీల పెళ్లిళ్లు నిశ్చయమవడంతో, అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. కాగా, ఇషాకు ఎంతో కాలంగా స్నేహితుడైన ఆనంద్‌, మహాబలేశ్వరం ఆలయంలో ఆమెకు ప్రపోజ్‌ చేయగా, ఇషా అంగీకరించడం... అనంతరం ఇరు కుటుంబాలు కలిసి ఎంగేజ్‌మెంట్‌ పార్టీ నిర్వహించడం జరిగింది.

1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement
 
Advertisement
Advertisement