ఐసీఐసీఐ లైఫ్‌తో ఎయిర్‌టెల్‌ బ్యాంక్‌ జట్టు | Airtel Payments Bank, ICICI Prudential partnership to offer insurance plans | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ లైఫ్‌తో ఎయిర్‌టెల్‌ బ్యాంక్‌ జట్టు

Oct 7 2019 5:14 AM | Updated on Oct 7 2019 5:14 AM

Airtel Payments Bank, ICICI Prudential partnership to offer insurance plans - Sakshi

ప్రైవేట్‌ రంగ జీవిత బీమా సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తాజాగా ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకుతో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం ఐసీఐసీఐ ప్రూ లైఫ్‌ జీవిత బీమా పాలసీలతో పాటు ఇతరత్రా పొదుపు పథకాలను కూడా ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాదారులు సులభతరంగా పొందేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. చౌక ప్రీమియంలతో మెరుగైన పథకాలను అందించడం, టెక్నాలజీని వినియోగించుకుని కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయడంపై దృష్టి పెడుతున్నట్లు ఐసీఐసీఐ ప్రూ లైఫ్‌ ఎండీ ఎన్‌ఎస్‌ కణ్ణన్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement