ఎయిర్‌ఏషియా ఆఫర్లు

AirAsia offers discounts: Domestic flights start at Rs 1199 - Sakshi

దేశీయ రూట్లకు రూ.1,199 నుంచి

విదేశీ రూట్లలో రూ.4,999 నుంచి

ముంబై: ఎయిర్‌ఏషియా సంస్థ విమాన టికెట్లపై డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తోంది. ట్రస్ట్‌ యువర్‌ వాండర్‌లస్ట్‌ పేరుతో ఈ ఆఫర్లను అందిస్తున్నామని ఎయిర్‌ఏషియా తెలిపింది. విమాన టికెట్లను దేశీయ రూట్లలో కనిష్ట చార్జీ రూ.1,199కు, అంతర్జాతీయ రూట్లలో రూ.4,399కే ఆఫర్‌ చేస్తున్నామని వివరించింది.

వచ్చే నెల 2లోపు, ఎయిర్‌ఏషియా అధికారిక వెబ్‌సైట్‌ నుంచి బుక్‌  చేసుకున్న వారికే  ఈ ఆఫర్లు వర్తిస్తాయని, వచ్చే ఏడాది ఫిబ్రవరి 17లోపు ప్రయాణాలకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని పేర్కొంది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు చార్జీ రూ.1,199 మాత్రమేనని తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top