మళ్లీ ‘ఆల్టో’కే అగ్రస్థానం | Again, the 'Alto' is the top | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘ఆల్టో’కే అగ్రస్థానం

Nov 21 2017 12:55 AM | Updated on Nov 21 2017 12:55 AM

Again, the 'Alto' is the top - Sakshi

న్యూఢిల్లీ: డిజైర్‌కు ఆల్టో చెక్‌ పెట్టింది. ఆగస్ట్, సెప్టెంబర్‌ నెలల్లో డిజైర్‌ వాహనమే టాప్‌–సెల్లింగ్‌ ప్యాసింజర్‌ మోడల్‌గా అవతరిస్తూ వచ్చింది. కానీ అక్టోబర్లో మళ్లీ ఆల్టోనే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సియామ్‌ తాజా గణాంకాల ప్రకారం.. మారుతీ సుజుకీ ఇండియాకు చెందిన ఆల్టో వాహన విక్రయాలు 19,447 యూనిట్లుగా ఉన్నాయి.

డిజైర్‌ వాహన అమ్మకాలు 17,447 యూనిట్లుగా నమోదయ్యాయి. డిజైర్‌ రెండో స్థానంలో నిలిచింది. మారుతీ బాలెనో 14,532 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానంలో ఉంది. హ్యుందాయ్‌ గ్రాండ్‌ ఐ10 నాల్గో స్థానంలో ఉంది. దీని అమ్మకాలు 14,417 యూనిటు. ఇక వేగనార్, సెలెరియో, స్విఫ్ట్‌  విటారా బ్రెజా, హ్యుందాయ్‌ ఎలైట్‌ ఐ20, క్రెటా తర్వాత స్థానాల్లో నిలిచాయి. టాప్‌–10 సెల్లింగ్‌ ప్యాసింజర్‌ వాహనాల్లో మారుతీవే ఏడు మోడళ్లు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement