ప్రపంచంలోనే అతి సన్నని ల్యాప్‌టాప్‌ లాంచ్‌ | Acer Swift 7 with Intel Core i7 processor launched as world's thinnest laptop | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అతి సన్నని ల్యాప్‌టాప్‌ లాంచ్‌

Jan 8 2018 12:53 PM | Updated on Jan 10 2018 1:55 PM

Acer Swift 7 with Intel Core i7 processor launched as world's thinnest laptop - Sakshi

ఏసెర్ ప్రపంచంలోనే పలుచనైన ల్యాప్‌టాప్‌ను సీఈఎస్‌ 2018లో లాంచ్‌ చేసింది.   కేవలం 9.98 మి.మి మందంతో అల్ట్రాపోర్టబుల్‌  ల్యాప్‌ట్యాప్‌ను స్విఫ్ట్ 7 పేరుతో ప్రవేశపెట్టింది. ఇంటెల్‌ కోర్‌  ఐ7 ప్రాసెసర్‌ తో దీన్ని  విడుదల చేసింది.  వినియోగదారులు సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లే సౌలభ్యంతో దీన్నిరూపొందించింది.  ముఖ‍్యంగా దీర్ఘ-దూర అంతర్జాతీయ విమానాలు లేదా రైలు ప్రయాణాల సందర్భంగా అతి తక్కువ-కాంతి పరిస్థితులలో కూడా  బ్యాక్‌ లిట్‌ కీబోర్డుతో పనిచేసుకోవచ్చని కంపెనీ  ప్రకటించింది. సుమారు రూ. 1,07,470 (1699 డాలర్లు)ధరలో మార్చి ఆరంభంనుంచి నార్త్‌ అమెరికాలో  అందుబాటులోకి రానుంది. అనంతరం  ఏప్రిల్‌నుంచి సుమారు రూ .1,29,329ధరలో మిగతా  దేశాల్లో లభ్యమవుతుంది.

ప్రపంచంలోనే అతి సన్నని ల్యాప్‌ట్యాప్‌ను తయారుచేసినందుకు తాము గర్వపడుతున్నామని యాసెర్ ఇంక్ ఐటీ ప్రోడక్ట్స్ ప్రెసిడెంట్  జెర్రీ కాయో చెప్పారు. శక్తివంతమైన ప్రదర్శనతో నిపుణుల కోసం రూపొందించినట్టు  తెలిపారు.  విండోస్‌ 10, 7వ జనరేషన్‌  ఇంటెల్‌కోర్‌ ప్రాసెసర్‌తో  రూపొందించిన ఈ  ల్యాప్‌ట్యాప్‌ సింగిల్‌ చార్జ్‌తో  10గంటల బ్యాటరీ లైఫ్‌ ఇస్తుందని  కంపెనీ తెలిపింది. అల్యూమినియం బాడీ డిజైన్‌, గొరిల్లా గ్లాస్‌, ఎన్‌బీటీ టచ్‌ స్క్రీన్‌ అండ్‌  టచ్‌  ప్యాడ్‌, 256 స్టోరేజ్‌ కెపాసిటీ, 8 జీబీ  ర్యామ్‌ , ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ లాంటివి ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.

దీంతోపాటు   స్పిన్ 3 డివైస్‌ను లాంచ్‌ చేయనున్నట్టు కూడా ప్రకటించింది. కొత్త స్పిన్ 3 ను 8 వ జనరేషన్‌ ఇంటెల్‌ ప్రాసెసర్‌, ఐసీఎస్ టెక్నాలజీ, తో 14 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే , రెండు ఫ్రంట్-ఫేసింగ్ స్పీకర్లు, ఏసెర్ ట్రూ హార్మోనీ టెక్నాలజీ లాంటి ఫీచర్లతో మరింత శక్తివంతంగా  రూపొందిస్తోందట. టాబ్లెట్  స్పేస్-డెవలప్మెంట్ టెంట్ మోడ్‌తో  అందివ్వనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement