రూ.1000 నోటు కావాలనుకుంటున్నారు... | 70% people want scrapped Rs 1000 note back, claims survey | Sakshi
Sakshi News home page

రూ.1000 నోటు కావాలనుకుంటున్నారు...

Sep 12 2017 7:19 PM | Updated on Sep 19 2017 4:26 PM

రూ.1000 నోటు కావాలనుకుంటున్నారు...

రూ.1000 నోటు కావాలనుకుంటున్నారు...

కేంద్రప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి, ఎనిమిది నెలలు కావొస్తోంది. 1000, 500 రూపాయి నోట్లను రద్దు చేసిన అనంతరం కొత్త కొత్త నోట్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి.

సాక్షి, ముంబై : కేంద్రప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి, ఎనిమిది నెలలు కావొస్తోంది. 1000, 500 రూపాయి నోట్లను రద్దు చేసిన అనంతరం కొత్త కొత్త నోట్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. అంతేకాక రద్దు చేసిన 500 రూపాయి నోటును ప్రభుత్వం తిగిరి మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. కానీ 1000 రూపాయి నోటును మాత్రమే ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. అసలు 1000 రూపాయి నోటును ప్రజలు కావాలనుకుంటున్నారో? లేదో? తెలుసుకోవడం కోసం ఓ అధ్యయనం చేపట్టారు. ఈ అధ్యయనంలో దాదాపు 70 శాతం మంది ప్రజలు తిరిగి 1000 రూపాయి నోటును మార్కెట్‌లోకి రావాలని కోరుకుంటున్నారని తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన స్థానిక భాష షార్ట్‌ న్యూస్‌ యాప్‌ వే2ఆన్‌లైన్‌ చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 1000 రూపాయి నోట్లు కావాలంటూ ప్రజలు తన స్పందన తెలియజేశారు.
 
62 శాతం మంది ప్రజలు నోట్‌ బ్యాన్‌ నుంచి వచ్చిన మార్పులతో సమస్యలు ఎదుర్కొనట్టు చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ మార్పులతో తమకెలాంటి సమస్యలేదని 38 శాతం ప్రజలు తెలిపారు.  నవంబర్‌ 8న ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. చలామణిలో ఉన్న 86 శాతం నోట్లు ఆ రద్దుతో నిరూపయోగంగా మారాయి. ఇటీవల ఆర్‌బీఐ వెలువరించిన డేటాలో రద్దయిన 99 శాతం నోట్లు తిరిగి బ్యాంకింగ్‌ సిస్టమ్‌లోకి వచ్చినట్టు తెలిసింది. నోట్ల రద్దు తర్వాత కొత్త రూ.2000, రూ.500 నోట్లను ఎక్కువగా విడుదల చేయడంతో మార్కెట్‌లో చిల్లర కొరత ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించడానికి రూ.200 బ్యాంకు నోట్లను కూడా ఆర్‌బీఐ ప్రవేశపెట్టింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement