గ్రహం అనుగ్రహం (07-09-2019)

Daily Rasi Phalalu in Telugu (07-09-2019) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి శు.నవమి రా.1.04 వరకు, తదుపరి దశమి, నక్షత్రం జ్యేష్ఠ ఉ.10.02 వరకు, తదుపరి మూలవర్జ్యం సా.6.15 నుంచి 7.51 వరకు, దుర్ముహూర్తం ఉ.5.48 నుంచి 7.26 వరకు, అమృతఘడియలు...తె.4.01 నుంచి 5.54 వరకు (తెల్లవారితే ఆదివారం).

సూర్యోదయం :    5.49
సూర్యాస్తమయం    :  6.07
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం
మేషం: బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వివాదాలకుదూరంగా ఉండండి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం: ఆరోగ్యం మందగిస్తుంది. పనుల్లో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగయత్నాలు వాయిదా.

మిథునం: శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటì  మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.

కర్కాటకం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. వాహనసౌఖ్యం. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. నూతన విద్యావకాశాలు.

సింహం:రుణదాతల ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. ఆర్థికఇబ్బందులు.  వ్యయ ప్రయాసలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

కన్య:బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

తుల:ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధనలబ్ధి. వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృశ్చికం:ఆకస్మిక ప్రయాణాలు. సోదరులు, మిత్రులతో వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. కళాకారులకు ఒత్తిడులు.

ధనుస్సు:సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. రాబడి పెరుగుతుంది. వాహనాలు,భూములు కొంటారు. విందువినోదాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూలత.

మకరం: ప్రయాణాల్లో మార్పులు. వృథా ఖర్చులు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులతో విభేదాలు. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

కుంభం: ధనలబ్ధి. యత్నకార్యసిద్ధి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు. కళాకారులకు సత్కారాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు.

మీనం:ఆకస్మిక దనలాభం. వాహనాలు కొనుగోలు చేస్తారు. మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. విందువినోదాలు. పనుల్లోవిజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.
– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top