గ్రహం అనుగ్రహం (30-10-2019) | Daily Horoscope in Telugu (30-10-2019) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (30-10-2019)

Oct 30 2019 5:54 AM | Updated on Oct 30 2019 5:54 AM

Daily Horoscope in Telugu (30-10-2019) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి శు.విదియ ఉ.6.01 వరకు, తదుపరి తదియ తె.5.03 వరకు (తెల్లవారితే గురువారం),నక్షత్రం... అనూరాధ రా.1.34 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం ఉ.6.04 నుంచి 7.37 వరకు, దుర్ముహూర్తం ప.11.20 నుంచి 12.06 వరకు అమృతఘడియలు... ప.3.25 నుంచి 4.53 వరకు.

సూర్యోదయం :    6.01
సూర్యాస్తమయం    :  5.28
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

భవిష్యం
మేషం: ఆర్థిక పరిస్థితి కొంత అయోమయంగా ఉంటుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. చిత్రమైన సంఘటనలు. పనుల్లో స్వల్ప అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృషభం: ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు కొన్ని ఫలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత సానుకూలత.

మిథునం: చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. భూములు, వాహనాలు కొంటారు. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

కర్కాటకం: సన్నిహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

సింహం: ఆర్థిక లావాదేవీలు మందకొడిగా ఉంటాయి. రుణాలు చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు. పనుల్లో జాప్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

కన్య: పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. అందరిలోనూ గుర్తింపు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు సంభవం.

తుల: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. దైవచింతన.

వృశ్చికం: నూతన పరిచయాలు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.

ధనుస్సు: మిత్రులతో కలహాలు. కొత్తరుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కుంభం: ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు ప్రగతిదాయకంగా ఉంటాయి.ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మీనం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలలో చికాకులు. దైవదర్శనాలు. స్థిరాస్తి వివాదాలు. ఆలోచనలు కలిసిరావు. వ్యాపారాలు అంతంత మాత్రమే. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.– సింహంభట్ల సుబ్బారావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement