గ్రహం అనుగ్రహం (26-03-2020) | Daily Horoscope in Telugu (26-03-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (26-03-2020)

Mar 26 2020 6:33 AM | Updated on Mar 26 2020 6:33 AM

Daily Horoscope in Telugu (26-03-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి శు.విదియ సా.5.56 వరకుతదుపరి తదియ, నక్షత్రం అశ్వని పూర్తి (24 గంటలు), వర్జ్యం రా.3.50 నుంచి, 5.37 వరకు, దుర్ముహూర్తం ఉ.10.10 నుంచి 10.56 వరకు, తదుపరి ప.2.55 నుంచి 3.44 వరకుఅమృతఘడియలు... రా.12.20 నుంచి 2.03 వరకు.

సూర్యోదయం :    6.03
సూర్యాస్తమయం    :  6.07
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
మేషం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు అందుతాయి. వస్తు, వస్త్రలాభాలు. పాతమిత్రుల కలయిక. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొంత ఊరట.

వృషభం: సన్నిహితులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు.

మిథునం: వ్యవహారాలలో పురోగతి. ఆస్తుల వివాదాలు పరిష్కారం. శుభకార్యాలపై చర్చలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.

కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు అధిగమిస్తారు.

సింహం: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూలత.

కన్య: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో జాప్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

తుల: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం. ఆస్తులు కొంటారు. కొన్ని సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

వృశ్చికం: పరపతి పెరుగుతుంది. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

ధనుస్సు: ఉద్యోగయత్నాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మకరం: సోదరులతో వివాదాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు.

మీనం: మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి కాస్త ఊరటనిస్తుంది. పనుల్లో జాప్యం. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. దైవచింతన.– సింహంభట్ల సుబ్బారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement