గ్రహం అనుగ్రహం (25-01-2020)

Daily Horoscope in Telugu (25-01-2020) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరఋతువు, మాఘ మాసం, తిథి శు.పాడ్యమి రా.3.20 వరకు తదుపరి విదియ, నక్షత్రం శ్రవణం రా.3.54 వరకుతదుపరి ధనిష్ఠ, వర్జ్యం ఉ.6.39 నుంచి 8.20 వరకుదుర్ముహూర్తం ఉ.6.38 నుంచి 8.06 వరకుఅమృతఘడియలు... సా.4.50 నుంచి 6.31 వరకు.

సూర్యోదయం :    6.38
సూర్యాస్తమయం    :  5.47
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం
మేషం: యత్నకార్యసిద్ధి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. బంధువులతో విభేదాలు తొలగుతాయి. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు. దైవచింతన.

వృషభం: మిత్రులతో వివాదాలు. కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అసంతృప్తి.

మిథునం: సోదరులు,మిత్రులతో స్వల్ప వివాదాలు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

కర్కాటకం: ప్రముఖుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందువినోదాలు. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

సింహం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి.

కన్య: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు శ్రమ. పనులు వాయిదా వేస్తారు. బంధువర్గంతో వివాదాలు. ఆరోగ్యభంగం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయి.

తుల: పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.

ధనుస్సు: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

మకరం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి, ధనలాభాలు. చిన్ననాటి మిత్రులతో సఖ్యత. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. విందువినోదాలు.

కుంభం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు. దైవచింతన.

మీనం: వ్యవహారాలలో పురోగతి. ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలస్థితి.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top