
శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి శు.పాడ్యమి ఉ.8.54 వరకు, తదుపరి విదియ, నక్షత్రం భరణి సా.5.34 వరకు, తదుపరి కృత్తిక వర్జ్యం... లేదు, దుర్ముహూర్తం ఉ.8.13 నుంచి 9.03 వరకుతదుపరి ప.12.21 నుంచి 1.11 వరకుఅమృతఘడియలు... ప.12.21 నుంచి 2.03 వరకు.
సూర్యోదయం : 5.42
సూర్యాస్తమయం : 6.13
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు
మేషం: పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. వస్తులాభాలు. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. దైవచింతన.
వృషభం:సన్నిహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఖర్చులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
మిథునం: పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
కర్కాటకం: సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వస్తు, వస్త్రలాభాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
సింహం: పనుల్లో ప్రతిష్ఠంభన. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఆస్తుల వివాదాలు.
కన్య: రుణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. బంధుమిత్రుల నుంచి సమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
తుల: పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పనుల్లో విజయం. ఆహ్వానాలు అందుతాయి. శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
వృశ్చికం:పనులు మధ్యలో విరమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు. ధనవ్యయం. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
ధనుస్సు: సన్నిహితులతో తగాదాలు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యభంగం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో చికాకులు.
మకరం: పనులలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. బంధువుల నుంచి ఒత్తిడులు. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మీనం: సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.