
శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి బ.దశమి రా.9.10 వరకు తదుపరి ఏకాదశి, నక్షత్రం ఆశ్లేష ప.12.19 వరకు తదుపరి మఖ, వర్జ్యం రా.11.31 నుంచి 1.00 వరకుదుర్ముహూర్తం ప.11.20 నుంచి 12.08 వరకుఅమృతఘడియలు... ఉ.10.45 నుంచి 12.16 వరకు.
సూర్యోదయం : 5.58
సూర్యాస్తమయం : 5.32
రాహుకాలం : ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుంచి 9.00 వరకు
భవిష్యం
మేషం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. అనుకోని ప్రయాణాలు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యభంగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
వృషభం: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. ప నులు సకాలంలో పూర్తి. సంఘంలో ఆదర ణ. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
మిథునం: విద్యార్థుల యత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.
కర్కాటకం: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికాభివృద్ధి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
సింహం: మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
కన్య: రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
తుల: ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి వృద్ధి. నూతన విద్యావకాశాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
వృశ్చికం: సన్నిహితులతో మాటపట్టింపు లు. ఆధ్యాత్మిక చింతన. పనులలో ప్రతిబంధకాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుసా ్తయి. బంధువులను కలుసుకుంటారు. వ్యా పారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.
ధనుస్సు: మిత్రులతో అకారణంగా వివాదాలు. పనులలో అవాంతరాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.
మకరం: నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆప్తుల నుంచి ధనలాభం. వివాదాల పరిష్కారంలో కీలక పాత్ర. పనులు మధ్యలో విరమిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రగతిపథంలో సాగుతాయి.
కుంభం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వస్తులాభాలు. ప్రముఖుల నుంచి పిలుపు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.
మీనం: వ్యయప్రయాసలు. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఉద్యోగాన్వేషణ ముందుకు సాగదు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.– సింహంభట్ల సుబ్బారావు