గ్రహం అనుగ్రహం (20-05-2020)

Daily Horoscope in Telugu (20-05-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి బ.త్రయోదశి రా.7.26 వరకు, తదుపరి చతుర్దశి , నక్షత్రం  అశ్విని రా.10.40 వరకు, తదుపరి భరణి, వర్జ్యం సా.6.15 నుంచి 8.01 వరకు, దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.22 వరకుఅమృతఘడియలు... ప.2.34 నుంచి 3.44 వరకు.

సూర్యోదయం :    5.30
సూర్యాస్తమయం    :  6.21
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

గ్రహఫలం
మేషం:కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతారు. కార్యసిద్ధి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

వృషభం:సన్నిహితులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మిథునం:శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. దూరపు బంధువుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.

కర్కాటకం:నూతన  ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

సింహం: మిత్రులతో అకారణంగా తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. సోదరుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కన్య: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప సమస్యలు.

తుల:ఆస్తి వివాదాలు పరిష్కారం. ఇంటిలో సంతోషకరమైన వాతావరణం. దైవదర్శనాలు. శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు అధిగమిస్తారు.

వృశ్చికం: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. నూతన పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ ఊహలు నిజం చేసుకుంటారు.

ధనుస్సు:మిత్రులతో వివాదాలు. ప్రయాణాలు వాయిదా. అనుకున్న పనుల్లో జాప్యం. దైవచింతన. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

మకరం:ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.

కుంభం:వ్యవహారాలలో విజయం. నూతన ఒప్పందాలు. సోదరులు, మిత్రులతో సఖ్యత. కుటుంబసౌఖ్యం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో మరింత సానుకూలత.

మీనం: మిత్రులతో వివాదాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top