గ్రహం అనుగ్రహం (16-07-2020)

Daily Horoscope in Telugu (16-07-2020) - Sakshi

 శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి బ.ఏకాదశి రా.9.46 వరకు, తదుపరి ద్వాదశి నక్షత్రం కృత్తిక సా.5.56 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం... లేదు దుర్ముహూర్తం ఉ.9.54 నుంచి 10.46 వరకు, తదుపరి ప.3.05 నుంచి 3.54 వరకు, అమృతఘడియలు... ప.3.15 నుంచి 5.00 వరకు, కర్కాటక సంక్రమణం, దక్షిణాయనం ప్రారంభం.

సూర్యోదయం :    5.37
సూర్యాస్తమయం    :  6.34
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

గ్రహఫలం
మేషం : ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు. ఆర్థిక ప్రగతి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

వృషభం:మిత్రుల నుంచి వ్యవహారాలలో ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కాస్త నిరాశ.

మిథునం...నూతన ఉద్యోగాలు దక్కవచ్చు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న అభివృద్ధి కనిపిస్తుంది.

కర్కాటకం...బంధువుల కలయిక. ధనలబ్ధి. నూతన ఉద్యోగావకాశాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

సింహం...మిత్రులు ఒత్తిడులు పెంచుతారు. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు. శ్రమాధిక్యం. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత అనుకూలిస్తాయి.

కన్య....శ్రమాధిక్యంతో పనులు పూర్తి. ప్రయాణాలు వాయిదా. బంధుమిత్రులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

తుల...కొత్త పనులు ప్రారంభిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ధన, వస్తులాభాలు. పరపతి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం...చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.

ధనుస్సు...పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మకరం...వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

కుంభం...కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

మీనం....పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top