గ్రహం అనుగ్రహం (15-07-2020)

Daily Horoscope in Telugu (15-07-2020) - Sakshi

 శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి బ.దశమి రా.8.20 వరకు, తదుపరి ఏకాదశి నక్షత్రం భరణి ప.3.45 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం తె.4.50 నుంచి 6.34 వరకు (తెల్లవారితే గురువారం), దుర్ముహూర్తం ప.11.37 నుంచి 12.31 వరకు, అమృతఘడియలు... ఉ.10.28 నుంచి 12.13 వరకు.

సూర్యోదయం :    5.36
సూర్యాస్తమయం    :  6.34
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

గ్రహఫలం
మేషం: ఆకస్మిక ధనలాభం. కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

వృషభం: పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. బంధుమిత్రుల నుంచి విమర్శలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. వస్తులాభాలు. మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. ధనలబ్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

కర్కాటకం:సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. దైవదర్శనాలు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. పనుల్లో విజయం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

సింహం: రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కన్య: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రమ మరింత పెరుగుతుంది. సన్నిహితులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

తుల:పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఒప్పందాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వృశ్చికం:మిత్రుల చేయూత. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు అందుతాయి. ఊహించని నిర్ణయాలు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన అవకాశాలు.

ధనుస్సు:రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. పనులు మధ్యలో వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.

మకరం:కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ప్రయాణాలలో మార్పులు. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

కుంభం: చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. చర్చలు సఫలం. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని అభివృద్ధి.

మీనం: శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. బంధువులతో విభేదిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top