ఆంధ్రప్రదేశ్ రాజధానిపై గురువారం శాసనసభలో రగడ జరిగింది. రాజధానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటనకు....
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధానిపై గురువారం శాసనసభలో రగడ జరిగింది. రాజధానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటనకు ముందే సభలో చర్చ జరగాలన్న ప్రతిపక్ష సభ్యుల డిమాండ్.. మరోవైపు ప్రభుత్వ విమర్శల మధ్య సభలో గురువారం తీవ్ర గందరగోళం ఏర్పడింది.
మంత్రులు తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేయడంతో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతుండగానే సభను 15 నిమిషాలు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. వాయిదా అనంతరం ప్రారంభం అయినా చర్చ జరగాల్సిందేనని వైఎస్ఆర్ సీపీ సభ్యులు తమ నిరసన కొనసాగుతోంది.