రావాలి జగన్‌.. కావాలి జగన్‌

YSRCP Ravali Jagan Kavali Jagan In Krishna - Sakshi

వాడవాడలా గుండెల నుంచి పెల్లుబికిన స్పందన

నవరత్నాలపై వైఎస్సార్‌ సీపీ శ్రేణుల విస్తృత ప్రచారం

విజయవాడ సిటీ : ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ అనే నినాదంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రీకారం చుట్టిన కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు నాయుడు మోసపూరిత ప్రభుత్వంతో విసిగివేసారిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో పీడవిరగడ చేసుకుందామని ఉవ్విళ్లురుతున్నారు. రాజన్న రాజ్యం మళ్లీ కావాలి.. అది జగనన్నతోనే సాధ్యమనే దృఢ విశ్వాసం, ఆకాంక్ష ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రతి గడపకూ వెళ్లి ప్రజలను జాగృతం చేస్తున్నారు. సోమవారం ప్రారంభమైన   ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ కార్యక్రమ విశేషాలు.     

మచిలీపట్నంలో ఉదయం 6:30 గంటలకే సిరివేళ్లపాలెం నుంచి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి గడపకూ వెళ్లి వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను వివరించారు. మహిళలు, పెద్దలు, యువత నుంచి విశేష స్పందన లభించింది.  

మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి శాంతినగర్‌లో రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. మైలవరం నియోజకవర్గం వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు.  

పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో రావాలి జగన్‌..కావాలి జగన్‌ కార్యక్రమం జరిగింది. పెనమలూరు నియోజకవర్గం సమన్వయకర్త, పార్టీ సీనియర్‌ నేత కొలుసు పార్ధసారథి పాల్గొన్నారు.

అవనిగడ్డ నియోజకవర్గంలోని దక్షిణ చిరువోలులంకలో రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమం సోమవారం సాయంత్రం ప్రారంభమైంది. నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ తిరిగి పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను వివరించారు. ఈ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహరావు, మండల కన్వీనర్‌ రేపల్లె శ్రీనివాసరావు, అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

పామర్రు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త కైలే అనీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమం జరిగింది.

గన్నవరం నియోజకవర్గంలోని బుద్దవరం శివారు రాజీవ్‌నగర్‌ కాలనీలో వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావ్‌ నేతృత్వంలో ఇంటింటికీ తిరిగి నవరత్నాలను ప్రచారం చేశారు. పార్టీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ గౌసాని, జిల్లా ప్రధాన కార్యదర్శులు కోటగిరి వరప్రసాదరావు, కాసరనేని గోపాలరావు, వై.నాగిరెడ్డి, నక్కాగాంధీ, కోడెబోయిన బాబీ, తులిమిల్లి  ఝాన్సీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కైకలూరు నియోజకవర్గంలోని కలదిండి మండలం పెదలంక గ్రామంలో రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచి, నవరత్నాలు వల్ల జరిగే లాభాలను వివరించారు. పార్టీ నేతలు పాపారావు గౌడ్, వాసిపల్లి యోనా, అబ్రహాంలింకన్, ఐనాల బ్రహ్మాజీ, నీలపాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నందిగామ నియోజకవర్గంలో రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ మొండితోక అరుణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నందిగామ మండలం అడివిరావులపాడు గ్రామంలో రావాలి జగన్‌.. కావాలి జగన్‌  కార్యక్రమంలో జరిగింది.  

తిరువూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి ఆధ్వర్యంలో ఎ–కొండూరు మండలం పాత కొండూరులో రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమం జరిగింది. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకొని, వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాల కరపత్రాలను ప్రజలకు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు నరెడ్ల వీరారెడ్డి, నియోజకవర్గ బూత్‌ కన్వీనర్ల అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ఆంజనేయులు, భూక్యా ఘనియా, ఎంపీటీసీ చంద్రమోహన్, జూపల్లి రాజేష్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గంలోసమన్వయకర్త యలమంచిలి రవి ఆధ్వర్యంలో24వ డివిజన్‌ గంగానమ్మగుడి వద్ద నుంచి రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమం జరిగింది.
పార్టీ శ్రేణులతో కలసి ఆయన ప్రతి ఇంటిని సందర్శించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ చందన సురేష్, ఎస్సీ సెల్‌ విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తోకల శ్యామ్‌కుమార్, యువజన విభాగం కార్యదర్శి తంగిరాల రామిరెడ్డి, చిత్రం లోకేష్, జయరాజు తదితరులు పాల్గొన్నారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 27వ డివిజన్‌ హరిజనవాడలో వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాస్, విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు ఎండీ ఇక్బాల్‌ ఆధ్వర్యంలో రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమం జరిగింది. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాల ద్వారా జరిగే లబ్ధిని ప్రజలకు వివరించడంతో పాటు చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను గడపగడపకు తీసుకెళ్లారు. కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షుడు ఆంజనేయరెడ్డితో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

నూజివీడు నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు ఆధ్వర్యంలో రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమం ముసునూరు మండలం, వేల్పుచర్లలో జరిగింది.  కార్యక్రమంలో ఎంపీటీసీ కాండూరి శ్రీరామచంద్ర, పార్టీ ముసునూరు మండల అధ్యక్షుడు మూల్పురి నాగమల్లేశ్వరరావు, యువజన విభాగం మండల అధ్యక్షుడు తులిమెల్లి రంగారావు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top