పెట్రోలు ధరల పెంపునకు నిరసనగా కల్యాణదుర్గంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు దిగారు.
కల్యాణదుర్గం (అనంతపురం జిల్లా) : పెట్రోలు ధరల పెంపునకు నిరసనగా కల్యాణదుర్గంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు దిగారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలు తమ బైక్‌లను తోసుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. కల్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ తిరుమల వెంకటేశ్వర్లు, పట్టణ కన్వీనర్ గోపారం శ్రీనివాసులు ఆధ్వర్యంలో బుధవారం ఈ ఆందోళనలు జరిగాయి.


