పులివెందులలో వైఎస్‌ జగన్‌కు బంపర్‌ మెజారీటీ

YSRCP President YS jagan Mohan Reddy Won In Pulivendula Constituency With Bumper Majority - Sakshi

వైఎస్సార్‌ జిల్లా: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో బంపర్‌ మెజార్టీతో గెలుపొందారు. వైఎస్‌ జగన్‌ తన సమీప టీడీపీ అభ్యర్థి సతీష్‌ రెడ్డిపై 90 వేల 543 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. వైఎస్‌ జగన్‌కు 2014 ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి 15 వేల 500 ఓట్లు ఎక్కువ వచ్చాయి. వైఎస్‌ జగన్‌తో పాటు వైఎస్సార్‌ జిల్లాలోని మిగతా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యాలతో ముందంజలో ఉన్నారు.

కడప అసెంబ్లీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అంజద్‌ బాషా 52532 ఓట్ల ఆధిక్యతతో, ప్రొద్దుటూరులో 43,200 ఆధిక్యతతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్‌ రెడ్డి, మైదుకూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి 27798 ఓట్ల ఆదిక్యతతో, బద్వేల్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ వెంకట సుబ్బయ్య 47 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

జమ్మలమడుగులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సుధీర్‌ రెడ్డి 31,515 ఓట్లతో, రైల్వే కోడూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొరుముట్ల శ్రీనివాసులు 24,059 ఓట్లతో, రాయచోటిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి 20,677 ఓట్ల ఆధిక్యతతో, రాజంపేటలో మేడా మల్లికార్జున రెడ్డి 27,465 ఓట్లతో, కమలాపురంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రవీంద్రనాథ్‌ రెడ్డి సుమారు 25 వేల ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top