నవరత్నాలతో ప్రతి కుటుంబానికీ లబ్ధి

YSRCP Navaratnalu Scheme Helpful To Every Poor People In Gudur - Sakshi

వైఎస్సార్‌సీపీ గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి వరప్రసాద్‌రావు

వాకాడు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ద్వారా నాంది పలికిన నవరత్నాలు అన్ని వర్గాల్లోని ప్రతి కుటుంబానికీ లబ్ధి చేకూరుతుందని గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌రావు పేర్కొన్నారు. ఆదివారం కొడవలూరు దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని యరగాటిపల్లి, బాలిరెడ్డిపాళెం, వాలమేడు పంచాయతీల్లో తిరుపతి ఎంపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌రావుతోపాటు సీజీసీ సభ్యుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి పలువురు నాయకులు కలసి వరప్రసాద్‌రావు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ముందుగా బుర్లవారిపాళెంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వరప్రసాద్‌రావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వైఎస్సార్‌సీపీని ఆదరిస్తున్న ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. టీడీపీ ప్రభుత్వంతో ఏ ఒక్క గ్రామం కూడా అభివృద్ధి చెందలేదన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే సాగు, తాగునీటికి కొరత లేకుండా చూస్తామన్నారు.

ఎంపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌రావు మాట్లాడుతూ మాట ఇస్తే మడమతిప్పని వైఎస్సార్‌ కుటుంబం నుంచి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే ఈ రాష్ట్రం సమూలంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఏదైనా చేయగల్గితేనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు మాట ఇస్తారే తప్ప అబద్ధాలు చెప్పడం ఆయన ఇంటా వంటా లేదన్నారు. ఈ సారి మనందరికీ సంక్షేమ పథకాలతో న్యాయం జరగాలంటే ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ నేదురుమల్లి ఉదయ్‌శేఖర్‌రెడ్డి, కొడవలూరు ధనంజయరెడ్డి, పల్లంపర్తి గోపాల్‌రెడ్డి, దువ్వూరు అజిత్‌కుమార్‌రెడ్డి, పెళ్లూరు కోటేశ్వరరెడ్డి, సన్నారెడ్డి రామచంద్రారెడ్డి, వాకాటి జనార్దన్‌రెడ్డి, నేదురుమల్లి గౌరవసాయిరెడ్డి, మారంరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి, ద్వారకానాథరెడ్డి, ఏనుగు సుధాకర్‌నాయుడు, గూడూరు సుధాకర్‌రెడ్డి, గూడూరు వెంకటేశ్వర్లురెడ్డి, దువ్వూరు భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top