breaking news
Vara Prasada Rao
-
ఒకే ఒక్క పిలుపు.. రాపాక స్పీచ్ కి దద్దరిల్లిన రాజోలు
-
నిన్ను పప్పు నాయుడు అనేది ఇందుకే..లోకేష్ వ్యాఖ్యలకు రాపాక సెటైర్లు
-
వైఎస్ జగన్ సామాజిక న్యాయాని చేసి చూపించారు
-
నవరత్నాలతో ప్రతి కుటుంబానికీ లబ్ధి
వాకాడు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ద్వారా నాంది పలికిన నవరత్నాలు అన్ని వర్గాల్లోని ప్రతి కుటుంబానికీ లబ్ధి చేకూరుతుందని గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌రావు పేర్కొన్నారు. ఆదివారం కొడవలూరు దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని యరగాటిపల్లి, బాలిరెడ్డిపాళెం, వాలమేడు పంచాయతీల్లో తిరుపతి ఎంపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్రావుతోపాటు సీజీసీ సభ్యుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి పలువురు నాయకులు కలసి వరప్రసాద్‌రావు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ముందుగా బుర్లవారిపాళెంలోని అంబేడ్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వరప్రసాద్‌రావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వైఎస్సార్సీపీని ఆదరిస్తున్న ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. టీడీపీ ప్రభుత్వంతో ఏ ఒక్క గ్రామం కూడా అభివృద్ధి చెందలేదన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే సాగు, తాగునీటికి కొరత లేకుండా చూస్తామన్నారు. ఎంపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌రావు మాట్లాడుతూ మాట ఇస్తే మడమతిప్పని వైఎస్సార్ కుటుంబం నుంచి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే ఈ రాష్ట్రం సమూలంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఏదైనా చేయగల్గితేనే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు మాట ఇస్తారే తప్ప అబద్ధాలు చెప్పడం ఆయన ఇంటా వంటా లేదన్నారు. ఈ సారి మనందరికీ సంక్షేమ పథకాలతో న్యాయం జరగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్రెడ్డిని సీఎంగా చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ నేదురుమల్లి ఉదయ్‌శేఖర్‌రెడ్డి, కొడవలూరు ధనంజయరెడ్డి, పల్లంపర్తి గోపాల్‌రెడ్డి, దువ్వూరు అజిత్‌కుమార్‌రెడ్డి, పెళ్లూరు కోటేశ్వరరెడ్డి, సన్నారెడ్డి రామచంద్రారెడ్డి, వాకాటి జనార్దన్‌రెడ్డి, నేదురుమల్లి గౌరవసాయిరెడ్డి, మారంరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి, ద్వారకానాథరెడ్డి, ఏనుగు సుధాకర్‌నాయుడు, గూడూరు సుధాకర్‌రెడ్డి, గూడూరు వెంకటేశ్వర్లురెడ్డి, దువ్వూరు భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. -
రైళ్లలో నేరాలు అరికట్టేందుకు చర్యలు
రాజమండ్రి సిటీ, న్యూస్‌లైన్ : రాజమండ్రి డివిజన్ పరిధిలోని ఉభయగోదావరి, విశాఖ, విజయవాడ బోర్డర్ల వరకూ రైళ్లలో నేరాలు జరగకుండా ఉండేందుకు రాత్రి పూట నిఘాను పటిష్టం చేశామని రాజమండ్రి జీఆర్పీ డీఎస్పీ వరప్రసాదరావు తెలిపారు. ఇతర ప్రాంతాల రైళ్లలో జరుగుతున్న దోపిడీలు, దొంగతనాలపై ఆయన స్పందించారు. విజయవాడ జిల్లా రైల్వే ఎస్పీ శ్యామ్‌ప్రసాద్ ఆదేశాల మేరకు రాజమండ్రి నుంచి అనకాపల్లి, కృష్టాజిల్లాలోని గుడివాడ వరకూ గల స్టేషన్లలో రైళ్ల రాకపోకల సమయాల్లో రాత్రి పూట పోలీసు గస్తీ పెంచామన్నారు. ప్రతి రైలులో ఆయుధాలు కలిగిన సిబ్బందిని వెంట పంపిస్తున్నామన్నారు. కాకినాడ, భీమవరం ఇన్స్పెక్టర్లు సీహెచ్‌రాజు, ఎస్కే బాజీలాల్ సహకారంతో ట్రాక్ వెంబడి రోడ్లను పర్యవేక్షిస్తూ రాత్రి సమయాల్లో గస్తీ ఏర్పాటు చేశామన్నారు. నేరానికి ఏవిధమైన ఆస్కారం లేకుండా సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్స్ తో రాత్రి సమయాల్లో పటిష్టమైన పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. మైక్రోఫోన్ల సహా యంతో ప్రయాణికులను అనుక్షణం అప్రమత్తం చేస్తున్నామన్నారు. ప్రయాణికులు రాత్రి సమయాల్లో బంగారు నగలు ధరించి గేటు వద్ద, బెర్త్‌ల్లో నిద్రించే సమయంలో అవసరమైన జాగ్రత్తలు పాటించాలన్నారు. నేరాల అదుపునకు పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచామన్నారు.