ఏడాది తిరక్కుండానే దిగజారిన ప్రభుత్వ ప్రతిష్ట | Ysrcp Mlc candidate Ummareddy venkateshwarlu Criticism on TDP | Sakshi
Sakshi News home page

ఏడాది తిరక్కుండానే దిగజారిన ప్రభుత్వ ప్రతిష్ట

Jun 7 2015 4:16 AM | Updated on Aug 14 2018 11:24 AM

ఏడాది తిరక్కుండానే దిగజారిన ప్రభుత్వ ప్రతిష్ట - Sakshi

ఏడాది తిరక్కుండానే దిగజారిన ప్రభుత్వ ప్రతిష్ట

రాజ్యాంగపరంగా ఏర్పడిన వ్యవస్థలను, ప్రతిపక్షాలను గౌరవించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రయోగాల ఫలితంగానే...

వ్యవస్థలను, ప్రతిపక్షాలను గౌరవించని ఫలితమే ఇది
డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శ

 
 తెనాలి : రాజ్యాంగపరంగా ఏర్పడిన వ్యవస్థలను, ప్రతిపక్షాలను గౌరవించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రయోగాల ఫలితంగానే ఏడాది తిరక్కముందే రాష్ట్రంలో ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలకమండలి సభ్యుడు, గుంటూరు ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన వంటి పార్టీల కూటమిగా పోటీచేసిన టీడీపీ కేవలం 1.94 శాతం ఓట్ల ఆధిక్యతతో అధికారం చేజిక్కించుకున్నట్టు గుర్తుచేశారు.

తాజా సర్వేలో టీడీపీ ప్రభుత్వ ప్రతిష్ట 11 శాతం పడిపోయిందని, ఇంత వేగంగా గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. శనివారం గుంటూరు జిల్లా తెనాలిలో పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు, నేతల సమావేశంలో మాట్లాడారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉమ్మారెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థలకు హక్కులు, బాధ్యతలు 72, 73 రాజ్యాంగ సవరణల ద్వారా సంక్రమించాయేగానీ రాష్ట్రప్రభుత్వం ఇచ్చింది కాదన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులను పక్కనబెట్టి ఓడినవారిని అందలమెక్కిస్తూ స్వార్ధ రాజకీయాల కోసం చంద్రబాబు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు. అన్ని రాజకీయపక్షాలను గౌరవించటమే ప్రజాజ్వామ్యంగా చెబుతూ, బాబు సీఎం అయ్యాక ప్రజాస్వామ్యమన్నా, రాజ్యాంగమన్నా గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. అదేవిధంగా గెలిచిన ప్రజాప్రతినిధులను తమ పార్టీ వ్యక్తులుగా ప్రకటించటం మరో తప్పిదమంటూ నెల్లూరు జిల్లా పరిషత్ వ్యవహారాన్ని సోదాహరణంగా వివరించారు.

ఎన్నికల కోసం రుణాలను మాఫీ చేస్తామని రైతులు, డ్వాక్రా, చేనేతలకు చంద్రబాబు హామీలనిచ్చి, ఆర్‌బీఐ, బ్యాంకులు, కేంద్రప్రభుత్వం సహకరించటం లేదని, తాజాగా అవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన హామీలంటున్నారని చెప్పారు. సరైన చర్య కాదనే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి రుణమాఫీ హామీ ఇవ్వలేదన్నారు. తనకున్న అపార రాజకీయ అనుభవంతో హామీలు నెరవేరుస్తానని ఎన్నికల కమిషన్‌కు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తన చర్యలతో బ్యాంకింగ్ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఉమ్మారెడ్డి ఆరోపించారు.

గత మార్చినాటికి రూ.97,975 కోట్లుగా ఉన్న బ్యాంకుల రుణబకాయిలు, వడ్డీతోసహా  రూ.లక్ష కోట్లు దాటిపోయి ఉంటాయన్నారు. దీని ఫలితం దశాబ్దాలుగా ఉంటున్నారు. కొల్లిపర జడ్పీటీసీ భట్టిప్రోలు వెంకటలక్ష్మి, తెనాలి మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత తాడిబోయిన రమేష్, కొల్లిపర మండల పార్టీ అధ్యక్షుడు జంగా శివనాగిరెడ్డి వేదికపై ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement