మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఎమ్మెల్యే

YSRCP MLA Sridevi Shows Humanity, Gives First Aid to Injured Person - Sakshi

రోడ్డుప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించిన శ్రీదేవి

సాక్షి, గుంటూరు: పరిస్థితి ఏదైనా ప్రజాసేవే ముఖ్యమనుకున్నారు. చదువుకున్న దానికి, తాను నిర్వర్తించిన వృత్తికి న్యాయం చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మానవత్వానికి ప్రతీకగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. పెదకాకాని హైవేపై కారు ఢీకొని బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్రగాయాలై రక్తపుమడుగులో పడిఉన్నాడు. అయితే అప్పటికే అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే శ్రీదేవికి రోడ్డు ప్రమాదంపై సమాచారం అందింది. హుటాహుటిన సంఘటనాస్థలికి వెళ్లిమరీ క్షతగాత్రుడిని పరీక్షించారు. అంబులెన్స్‌ను రప్పించి మరీ బాధితుడికి ప్రాథమిక వైద్యం అందించి ప్రాణాలు నిలబెట్టారు. ఎమ్మెల్యే శ్రీదేవి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మెరుగైన చికిత్సకోసం అతడిని ఆస్పత్రికి తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top