సెంట్రల్‌ జైలుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి | YSRCP MLA Kotamreddy Sent To Police Remand | Sakshi
Sakshi News home page

సెంట్రల్‌ జైలుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి

Mar 9 2019 3:36 PM | Updated on Mar 9 2019 7:48 PM

YSRCP MLA Kotamreddy Sent To Police Remand - Sakshi

సాక్షి, నెల్లూరు: వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులను ప్రశ్నించినందుకు అరెస్టయిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు ఆయనను సెట్రల్‌ జైలుకు తరలించారు. ఆయన అరెస్ట్‌పై పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోటంరెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కోటంరెడ్డి రిమాండ్‌పై ఆయన కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తీవ్రంగా మండిపడ్డారు. కోటం రెడ్డిని అక్రమంగా అరస్ట్‌ చేశారని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సర్వేల పేరుతో వైఎస్సార్‌సీపీ ఓట్లను తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నేతలపైనే కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement