గుంటూరు రూరల్‌ ఎస్పీని కలిసిన వైఎస్సార్‌సీపీ నాయకులు | YSRCP Leaders Meet Guntur Rural SP Over BC Man Suicide Attempt | Sakshi
Sakshi News home page

గుంటూరు రూరల్‌ ఎస్పీని కలిసిన వైఎస్సార్‌సీపీ నాయకులు

Feb 28 2019 3:20 PM | Updated on Feb 28 2019 4:01 PM

YSRCP Leaders Meet Guntur Rural SP Over BC Man Suicide Attempt - Sakshi

సాక్షి, గుంటూరు : బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా వ్యవహరించిన గురజాల సీఐపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం గుంటూరు రూరల్‌ ఎస్పీని కలిసి గురజాల సీఐ రామరావుపై ఫిర్యాదు చేశారు. అనతరం మీడియాతో మాట్లాడుతూ.. బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఆత్మహత్యాయత్నం కేసును ప్రత్యేక డీఎస్పీతో దర్యాప్తు చేయిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారన్నారు.

అంతేకాక కుల రాజకీయాలను రెచ్చగొడుతున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరామని తెలిపారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అసలు ఓట్లు తొలగించి దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement