120 స్థానాల్లో గెలుపు ఖాయం: పిల్లి సుభాష్‌

YSRCP Leader Pilli Subhash Chandra Bose Pray To Tirumala - Sakshi

తిరుమలను దర్శించుకున్న పలువురు ప్రముఖులు

సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి శ్రీవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మాజీమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ స్వామి వారిని ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 120 స్థానాల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ప్రజల మద్దతు ఆయనకే ఉందని, జాతీయ స్థాయిలో సర్వేలన్ని వైఎస్సార్‌సీపీకే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. 

అమరావతి కోటపై వైఎస్సార్‌సీపీ జెండా
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృద్వీరాజ్‌ మొదటిసారిగా అలిపిరి నుంచి కాలినడక మార్గంలో వెళ్లారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తానని ఆయన తెలిపారు. ఏపీ ప్రజల ఆకాంక్ష మేరకు వైఎస్‌ జగన్‌ సీఎం కావాలన్నారు. మే 23న అమరావతి కోటపై వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు.  

మహర్షి సినిమా దర్శక, నిర్మాతలు పైడిపల్లి వంశీ, దిల్‌రాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మహేష్‌ బాబు హీరోగా నటించిన మహర్షి విజయంతో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top