ఇది తాలిబన్‌ పాలనా..?

ఇది తాలిబన్‌ పాలనా..? - Sakshi


- రైతులను తీగలకు వేలాడదీసినా పట్టించుకోరా?

- వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ హెచ్చరిక




సాక్షి, హైదరాబాద్‌:
ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్నది చంద్ర బాబు పాలనా? తాలిబన్‌ పాలనా? అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. రైతులను కరెంటు తీగలకు వేలాడదీస్తున్నా కళ్లప్పగించి చూస్తున్న రాక్షస ప్రభుత్వమిది అని మండిపడ్డారు.



సోమవారం పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇంత జరుగుతున్నా సీఎంగానీ, ఒక్క మంత్రిగాని స్పందించకపోవడం దారుణమన్నారు. శాంతి భద్రతలు పూర్తిగా మర్చిపోయారని, చట్టాన్ని గౌరవించడం ఈ ప్రభుత్వంలో లేదని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. టీడీపీ నేతలు అధికారమదంతో ఇష్టానుసారంగా వ్యవహ రిస్తుంటే పోలీసులు నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు. (చదవండి: పరిహారమడిగితే వేలాడదీశారు!)



ఏపీ సీఎం బాటలోనే టీడీపీ నేతలు

అనంతపురం జిల్లాలో ఎలాంటి పరిహారం ఇవ్వకుండా తన భూమి మీదుగా కరెంటు తీగలు వేయడాన్ని వ్యతిరేకించిన రైతు పట్ల, ఒంటరి మహిళ మీద టీడీపీ సర్పంచ్‌ చేసిన గూండాగిరీ వంటివి తాలిబన్ల పాలనలో తప్ప ఎక్కడా జరగవని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేశ్‌లను కూడా తీగలకు వేలాడదీస్తే రైతుల బాధలు తెలుస్తాయన్నారు. చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి సోదరుడు, అతని అనుచరులు ఓ జర్నలిస్టుపై గూండా ల్లాగా జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా మని చెప్పారు.  ప్రజల తరపున మీడియా ప్రశ్నిస్తే భౌతిక దాడులకు పాల్పడతారా? అని ప్రశ్నించారు. మహిళా తహసీల్దార్‌ వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులు జుట్టుపట్టుకొని కొట్టిన రోజునే శిక్షించి ఉంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదన్నారు. ప్రత్యేక హోదాపై ప్రశ్నించినందుకు నువ్వే చానల్‌ విలేకరివి? అని స్వయానా సీఎం బెదిరిస్తుంటే పార్టీ నేతలు వేరేలా ఎలా ప్రవర్తిస్తారని ఎద్దేవా చేశారు.



కమీషన్లు దండుకోవడానికేనా..?

కాంట్రాక్టర్లకు, అవినీతి మంత్రులకు కొమ్ముకాసి వారి నుంచి వాటాలు పంచుకోవటానికే ఈ ప్రభుత్వం పనిచే స్తుందని పద్మ దుయ్యబట్టారు. నెల్లూరు జిల్లాలో రైల్వే లైన్‌ వేయకుండా కమీషన్ల కోసం అడ్డుకున్న చరిత్ర టీడీపీ ఎమ్మెల్యేలకు ఉందన్నారు. గుంటూరులో కమీషన్ల కోసం స్పీకర్‌ కోడెల కుమారుడు పనులు ఆపుతున్నారని కేంద్రా నికి ఫిర్యాదు చేశారన్నారు. చంద్రబాబు విష సంస్కృతిని పోషించినా, తాము అధికారంలోకి వచ్చాక వారి కోరలు పీకుతామని హెచ్చరించారు. ప్రత్యేక హోదాపై ప్రజల్లో దావానలంలా ఉన్న అగ్నిగోళం బద్దలైన రోజున మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top