నెల్లూరు బరిలోని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే

YSRCP Announced Candidates List @ Nellore - Sakshi

సర్వేపల్లి నియోజకవర్గం


అభ్యర్థి పేరు: కాకాణి గోవర్ధన్‌రెడ్డి
జన్మస్థలం : తోడేరు, పొదలకూరు మండలం
విద్యార్హత: బీఈ(మైసూర్‌ యూనివర్సిటీ)
కుటుంబ నేపథ్యం: రాజకీయ కుటుంబం
తల్లిదండ్రులు: లక్ష్మీకాంతమ్మ – కాకాణి రమణారెడ్డి  (మాజీ సమితి అధ్యక్షుడు) 
సతీమణి: విజిత
కుమార్తెలు : పూజిత, సుచిత్ర
రాజకీయ ప్రస్థానం
2006లో సైదాపురం జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికై జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా నిమితులయ్యారు. 2014లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై ఘన విజయం సాధించారు.  మళ్లీ రెండో పర్యాయం ఎన్నికల బరిలో నిలిచారు.

గూడూరు నియోజకవర్గం


అభ్యర్థి పేరు : వెలగపల్లి వరప్రసాద్‌రావు 
పుట్టిన తేదీ : 15.05.1953
విద్యార్హత : ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ(ఆంధ్రా యూనివర్సిటీ), బయోకెమిస్ట్రీ 
ఉద్యోగం : 1982లో రిజర్వ్‌ బ్యాంకులో పనిచేశారు. అనంతరం ఐఏఎస్‌కు సెలెక్టయి తమిళనాడులోని మూడు జిల్లాలకు కలెక్టర్‌గా(1983 – 2009 వరకు) పనిచేశారు. 2009లో ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పనిచేశారు.
భార్య : లక్ష్మి, ఎమ్మెస్సీ 
జన్మస్థలం : కొమ్మలమూడి, మండవల్లి మండలం, కృష్ణా జిల్లా 
రాజకీయ ప్రస్థానం
2009లో ప్రజారాజ్యంలో చేరారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం గూడూరు నుంచి పోటీకి దిగారు.

కోవూరు నియోజకవర్గం


అభ్యర్థి పేరు : నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
పుట్టిన తేదీ : 12.12.1961
విద్యార్హత : బీఏ (నిజాం కాలేజ్, హైదరాబాద్‌)
జన్మస్థలం : కోట 
తల్లిదండ్రులు : నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, శ్రీలక్ష్మమ్మ
భార్య : నల్లపరెడ్డి గీత
కుమారుడు : నల్లపరెడ్డి రజత్‌కుమార్‌రెడ్డి
రాజకీయ ప్రస్థానం
తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి రాజకీయ వారసుడిగా 1993లో ఆయన మరణాంతరం ప్రసన్నకుమార్‌రెడ్డి ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 1994లో జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఎన్టీఆర్‌ కేబినెట్‌లో చక్కెర కర్మాగారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2004లో ఓడిపోయి 2009లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. 2009లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రసన్నకుమార్‌రెడ్డి ఆకర్షితులయ్యారు. వైఎస్సార్‌ మరణానంతరం ఆయన పేరును సీబీఐ చార్జిషీట్‌లో చేర్చడంపై నిరసనగా ప్రసన్నకుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో  చేరారు. 2012లో ప్రసన్నకుమార్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై 23,494 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం కోవూరు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.

నెల్లూరు సిటీ నియోజకవర్గం 


అభ్యర్థి పేరు : పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌
జన్మస్థలం : కొత్తూరు(అంబాపురం)
పుట్టిన తేదీ : 23.03.1980
తండ్రి : కీ.శే.పోలుబోయిన తిరుపాలయ్య 
భార్య : జాగృతి
కుమార్తె : సమన్వవి
కుమారుడు : దర్శనందన్‌
విద్యార్హతలు : వైద్యవిద్య – బీడీఎస్‌
రాజకీయ ప్రస్థానం
చిన్నాన్న సుధాకర్‌ మృతిచెందడంతో 2008లో నెల్లూరు నగరంలోని 20 డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశ దక్కింది. 91 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం వైఎస్సార్‌సీపీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరించి 2014 ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి ఘన విజయం సాధించారు. మళ్లీ రెండో పర్యాయం నెల్లూరు నగరం నుంచి బరిలో దిగారు.

ఆత్మకూరు నియోజకవర్గం


అభ్యర్థి పేరు : మేకపాటి గౌతమ్‌రెడ్డి
జన్మస్థలం : బ్రహ్మణపల్లి, మర్రిపాడు మండలం
తల్లిదండ్రులు : మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మణిమంజరి
విద్యార్హత : ఎమ్మెస్సీ, టెక్స్‌టైల్స్‌(మాంచెస్టర్, యూకే)
కుటుంబం : భార్య – శ్రీకీర్తి, కుమార్తె అన్యన్యరెడ్డి, 
కుమారుడు – అర్జున్‌రెడ్డి
బాధ్యతలు : కె.ఎం.సి. సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌
రాజకీయ ప్రస్థానం
2014లో ఆత్మకూరు ఎమ్మెల్యేగా 30,191 ఓట్లతో గెలుపొందారు. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఉదయగిరి, ఒంగోలు, నరసరావుపేట, నెల్లూరు పార్లమెంట్‌ సభ్యుడిగా పనిచేశారు. మేకపాటి కుటుంబానికి జిల్లాలో రాజకీయంగా మంచిపట్టు ఉంది. వైఎస్సార్‌సీపీ తరఫున మళ్లీ ఆత్మకూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు.

కావలి నియోజకవర్గం


అభ్యర్థి పేరు: రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి 
జన్మస్థలం : కావలి పట్టణం 
పుట్టిన తేదీ : 04.06.1964
విద్యార్హత : కావలిలోని విశ్వోదయ బాలుర ఉన్నత పాఠశాలలో, జవహర్‌ భారతి కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. చెన్నైలో సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. 
తల్లిదండ్రులు : రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి, శివరావమ్మ
భార్య : ఆదిలక్ష్మి
పిల్లలు : బాల సాకేత్‌రెడ్డి, సంహిత
వ్యాపారాలు : కాంట్రాక్టర్‌గా వ్యాపారాన్ని ప్రారంభించి బిల్డర్‌గా స్థిరపడ్డారు. 
ప్రజాసేవ : వ్యాపారాలు బెంగళూరులో ఉండడంతో అక్కడే లయన్స్‌ క్లబ్‌లో చేరి సేవా కార్యాక్రమాలు విస్తృతంగా చేశారు. కావలి సమీపంలోని కడనూతల గ్రామం వద్ద ఆర్‌ఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలను ఏర్పాటు చేశారు.
రాజకీయ ప్రస్థానం
2009 లో  కావలి అసెంబ్లీ స్థానం నుంచి ప్రజారాజ్యం అభ్యర్ధిగా పోటీ చేశారు. అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌సీపీలో చేరారు. 2011 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా వైఎస్సార్‌సీపీ తరుపన పోటీ చేశారు. తర్వాత 2014 లో కావలి నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్ధిగా çపోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

ఉదయగిరి నియోజకవర్గం


అభ్యర్థి పేరు : మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి
జననం : 1952
తల్లిదండ్రులు : వెంకటసుబ్బమ్మ, వెంకురెడ్డి
జన్మస్థలం : బ్రాహ్మణపల్లి, మర్రిపాడు మండలం
విద్యార్హత : ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి.
భార్య : తులశమ్మ
సంతానం : ఒక కుమార్తె
రాజకీయ ప్రస్థానం
1994లో రాజకీయ అరంగేట్రం చేసి బూదవాడ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1999లో జరిగిన ఎన్నికల్లో కంభం విజయరామిరెడ్డిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004, 2009లలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కంభం విజయరామిరెడ్డి(టీడీపీ)పై గెలుపొందారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం అనంతరం ఆ పార్టీలో చేరి 2012 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బొల్లినేని వెంకటరామారావుపై విజయం సాధించారు. 2014లో మళ్లీ వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బొల్లినేని వెంకటరామారావు చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం మళ్లీ బరిలో నిలిచారు.

వెంకటగిరి నియోజకవర్గం


అభ్యర్థి పేరు : ఆనం రామనారాయణరెడ్డి  
పుట్టిన తేదీ : 10.07.1952
తండ్రి : ఆనం వెంకటరెడ్డి
విద్యార్హత : బీకాం, బీఎల్‌ 
రాజకీయ నేపథ్యం
1982లో జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1983లో మొదటిసారిగా నెల్లూరు నగరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1984లో రాష్ట్ర క్రీడా మండలి చైర్మన్‌గా, 1985లో రాపూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 1988లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో ఆర్‌అండ్‌బీ మంత్రిగా పనిచేశారు. అనంతరం 1989లో టీడీపీ అభ్యర్థిగా, 1994లో రాపూరు కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఓటమి పాలయ్యారు. 1999, 2004లలో రాపూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందారు. 2004లో దివంగత వైఎస్సార్‌ హయాంలో రాపూరు నుంచి గెలిచిన క్రమంలో 2007 నుంచి రాష్ట్ర సమాచారశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో ఆత్మకూరు నుంచి గెలుపొందారు. నాటి ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్‌ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల మంత్రివర్గంలో పనిచేశారు. 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం వెంకటగిరి నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

సూళ్లూరుపేట నియోజకవర్గం


అభ్యర్థి పేరు : కిలివేటి సంజీవయ్య
జన్మస్థలం : కాదలూరు, తడ మండలం 
తల్లిదండ్రులు : రాజయ్య–మస్తానమ్మ
భార్య : పసల సుభాషిణి(మాజీ మంత్రి పసల పెంచలయ్య ఏకైక కుమార్తె)
సంతానం : ఇద్దరు కుమార్తెలు
విద్యార్హత : బీటెక్‌ సివిల్‌ ఇంజినీర్‌
ఉద్యోగం : 1993లో గృహనిర్మాణ శాఖలో ఇంజినీర్‌గా ప్రవేశించి డీఈ అయ్యారు
రాజకీయ ప్రస్థానం
మాజీ మంత్రి పసల పెంచలయ్య రాజకీయ వారసుడిగా కొనసాగుతున్నారు. 2013లో వైఎస్సార్‌సీపీలో చేరారు. 2014లో సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మళ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.

నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం


అభ్యర్థి పేరు : కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
పుట్టిన తేదీ : 26.4.1964
విద్యార్హతలు : డిగ్రీ (వీఆర్‌ కళాశాల, నెల్లూరు)
తల్లిదండ్రులు : బాబిరెడ్డి – సరళమ్మ
భార్య : సునందమ్మ
కుమార్తెలు : లక్ష్మీహైందవి, సాయివైష్ణవి
రాజకీయ ప్రస్థానం
రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి విద్యార్థి సంఘం నేతగా ప్రస్థానం మొదలుపెట్టి ఎమ్మెల్యే స్థాయికి అంచెలంచెలుగా ఎదిగారు. 1980లో వీఆర్‌ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా, అనంతరం ఎస్వీ యూనివర్సిటీ సెనెట్‌ మెంబర్‌గా పనిచేశారు. ఏబీవీపీలో పనిచేశారు. వైఎస్సార్‌ ఆశయాల పట్ల ఆకర్షితుడై 1988 నుంచి కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ గుర్తింపు పొందారు. 2009లో మెడికల్‌ ఇన్‌ఫ్రా డైరెక్టర్‌గా పనిచేశారు. 2009 నుంచి వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. 2014లో నెల్లూరు రూరల్‌ నుంచి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. మళ్లీ రెండో పర్యాయం బరిలో నిలిచారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top