
గ్రేటర్ విశాఖ ఎన్నికలకు వైఎస్ఆర్ సీపీ సిద్ధం: జిల్లా అధ్యక్షుడు
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్కు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.
విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్కు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని విశాఖపట్నం జిల్లా ఆ పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఆదివారం విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ... గ్రేటర్ విశాఖపట్నం పరిధిలోని 72 డివిజన్లలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. అందుకోసం రేపటి నుంచి వార్డు స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే వచ్చే నెల 10వ తేదీలోగా ప్రజాస్వామ్యబద్దంగా కమిటీలను నియమించనున్నట్లు గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు.