మెడికోలకు అన్యాయం జరిగితే ఊరుకోం: వైఎస్ఆర్ సీపీ | YSR Congress party Leaders takes on TDP Government | Sakshi
Sakshi News home page

మెడికోలకు అన్యాయం జరిగితే ఊరుకోం: వైఎస్ఆర్ సీపీ

Aug 9 2014 1:00 PM | Updated on Oct 9 2018 7:43 PM

మెడికోలకు అన్యాయం జరిగితే ఊరుకోం: వైఎస్ఆర్ సీపీ - Sakshi

మెడికోలకు అన్యాయం జరిగితే ఊరుకోం: వైఎస్ఆర్ సీపీ

స్విమ్స్ ఆసుపత్రికి బదలాయించిన భవనాలను తక్షణమే మెటర్నటీకి అప్పగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

తిరుపతి: స్విమ్స్ ఆసుపత్రికి బదలాయించిన భవనాలను తక్షణమే మెటర్నటీకి అప్పగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అందుకోసం తిరుపతిలో మెడికోలు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపింది. శనివారం తిరుమలలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే నారాయణ స్వామి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఆసుపత్రి భవనాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని అసెంబ్లీలో ఎండగడతామని చెప్పారు.

గతంలో ధర్మాసుపత్రులలో యూజర్ ఛార్జీలు వసూలు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అని వారు గుర్తు చేశారు. మెడికోలకు అన్యాయం జరిగితే చూస్తు ఊరుకోమని భూమన కరుణాకర్ రెడ్డి, నారాయణ స్వామి స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement