జేసీ దివాకర్ రెడ్డి వల్లే అనంత హత్యలు | YSR Congress party leaders takes on JC Diwakar reddy | Sakshi
Sakshi News home page

జేసీ దివాకర్ రెడ్డి వల్లే అనంత హత్యలు

Aug 22 2014 12:03 PM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురం జిల్లాలో తమ పార్టీ కార్యకర్తల హత్యకు స్థానిక ఎంపీ, టీడీపీ నాయకుడు జేసీ దివాకర్రెడ్డే కారణమని వైఎస్ఆర్ సీపీ నాయకులు ఆరోపించారు.

హైదరాబాద్: అనంతపురం జిల్లాలో తమ పార్టీ కార్యకర్తల హత్యకు స్థానిక ఎంపీ, టీడీపీ నాయకుడు జేసీ దివాకర్రెడ్డే కారణమని వైఎస్ఆర్ సీపీ నాయకులు గుర్నాథ్రెడ్డి, అనంతవెంకట్రామిరెడ్డి, శంకర్ నారాయణలు ఆరోపించారు. హత్యకు గరైన వైఎస్ఆర్ సీపీ కార్యకర్త మల్లికార్జున మృతదేహంతో శనివారం అనంతపురం ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

అయితే వారి ఆందోళనకు పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వైఎస్ఆర్ సీపీ నేతలతోపాటు కార్యకర్తలకు, పోలీసులకు మధ్య  తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో ఎస్పీ కార్యాలయం ప్రాంతం తీవ్ర ఉద్రిక్తతగా మారింది.  టీడీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు పెచ్చురిల్లాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement