‘ప్రజలు ఛీ కొట్టిన నేత చంద్రబాబు’

YSR Congress Party Leaders Fires On Chandrababu In Kadapa - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రజలు ఛీ కొట్టిన నేత అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి విమర్శించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు నడుం బిగించాలని కోరారు. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఫలితంగానే కేసీ కెనాల్‌కు నీరు వచ్చిందన్నారు. రాష్ట్రంలో దోపిడీ దొంగలు రాజ్యం ఏలుతున్నారని విమర్శించారు. మైదుకూరు నియోజకవర్గంలోని రాజోలు రిజర్వాయర్‌ పూర్తి అవ్వాలంటే వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని అన్నారు. మైదుకూరు మున్సిపాలిటీకి 5కోట్లు ఇస్తామన్న చంద్రబాబు పంగనామాలు పెట్టాడని తెలిపారు.  మైదుకూరు ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా అవినాష్‌ రెడ్డిని ఘన మెజార్టీతో గెలిపించాలని కోరారు.

కరువు, చంద్రబాబు కవల పిల్లలు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కరువు కవల పిల్లలని కడప ఎమ్మెల్యే అంజాద్‌ బాషా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన, రైతుల వ్యతిరేక పాలన కొనసాగుతూందని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కారణంగానే జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లు వస్తున్నాయని అన్నారు. మైదుకూరు కేసీ కెనాల్‌కు నీళ్లు రావటానికి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎంపీ అవినాష్‌ రెడ్డి కారణమన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఇప్పుడు రైతుల పట్ల కపట నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.  వైఎస్‌ జగన్‌ ప్రజలకోసం తపిస్తున్న ఏకైక నాయకుడని అన్నారు.

ఆ ఘనత వైఎస్‌కే దక్కుతుంది
పోతిరెడ్డిపాడు నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు తెప్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి దక్కుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు సురేష్‌ బాబు అన్నారు. 2019లో జరగబోయే ఎన్నికల యుద్ధానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సైనికులు సిద్దం అవ్వాలని సూచించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు. జిల్లాకు సాగు నీరు ఇచ్చామని చెప్పుకోవటానికి చంద్రబాబుకు సిగ్గుండాలన్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిట్టనిలువునా ముంచిన ఘనుడని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top