
సాక్షి, అమరావతి : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 135వ రోజు షెడ్యూలు విడుదలైంది. గురువారం ఉదయం ఉండవల్లి శివారు నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు. పట్టాభిరామయ్య కాలనీ, మహానాడు, సుందరయ్యనగర్ మీదుగా కొనసాగనున్న పాదయాత్ర మణిపాల్ ఆస్పత్రి వరకు చేరుకుంటుంది. 135వ రోజు పాదయాత్ర అక్కడే ముగుస్తుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
134వ రోజు ముగిసిన పాదయాత్ర
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దిగ్విజయంగా కొనసాగిస్తున్న ప్రజాసంకల్పయాత్ర 134వ రోజు ఉండవల్లిలో ముగిసింది. నేటి ఉదయం నవులురు క్రాస్‌లో ప్రారంభించిన యాత్ర ఎర్రబాలెం, పెనుమాక మీదుగా కొనసాగింది. ఉండవల్లికి చేరుకున్న అనంతరం సాయంత్రం అక్కడ నిర్వహించిన భారీ బహిరంగ సభలో వైఎస్ పాల్గొని ప్రసంగించారు. బుధవారం పాదయాత్ర అక్కడే ముగించారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. నేడు 11.3 కిలోమీటర్లు నడిచిన వైఎస్ జగన్.. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఇప్పటివరకూ 1749.4 కిలో మీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు.