ప్రజాసంకల్పయాత్ర 17వ రోజు షెడ్యూల్‌ | YS Jagan's Praja Sankalpa Yatra Day 17 Schedule | Sakshi
Sakshi News home page

వెల్దుర్తి నుంచి 17వ రోజు ప్రజాసంకల్పయాత్ర

Nov 24 2017 2:18 PM | Updated on Jul 25 2018 4:53 PM

YS Jagan's Praja Sankalpa Yatra Day 17 Schedule - Sakshi - Sakshi - Sakshi

వైఎస్‌ జగన్‌ ఫైల్‌ ఫోటో

సాక్షి, వెల్దుర్తి : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 17వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి నుంచి ఆయన శనివారం ఉదయం పాదయాత్రను ప్రారంభించనున్నారు.

రేపు ఉదయం 8 గంటలకు వెల్దుర్తి, చెరుకులపాడు, పుట్లూరు క్రాస్‌, తొగరచేడు క్రాస్‌ వద్దకు చేరుకుంటారు.  ఈ యాత్రలో వైఎస్‌ జగన్‌ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు.

భోజన విరామం అనంతరం కృష్ణగిరి నుంచి పాదయాత్ర పున:ప్రారంభం అవుతుంది. అలాగే సాయంత్రం 6.30గంటలకు రామకృష్ణ పురం చేరుకుంటారు.  అనంతరం రాత్రి 7.30 గంటలకు వైఎస్‌ జగన్‌ బస చేస్తారు. ఈమేరకు 17రోజు పర్యటన వివరాలను వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement