మూడేళ్లుగా ఒక్క ఇటుకా పెట్టలేదు.. | YS. Jaganmohan Reddy comments on power point presentations | Sakshi
Sakshi News home page

మూడేళ్లుగా ఒక్క ఇటుకా పెట్టలేదు..

Mar 26 2017 3:11 AM | Updated on May 25 2018 8:03 PM

మూడేళ్లుగా ఒక్క ఇటుకా పెట్టలేదు.. - Sakshi

మూడేళ్లుగా ఒక్క ఇటుకా పెట్టలేదు..

మూడేళ్లుగా రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పెట్టలేదని, అమరావతి నగర నిర్మాణమంటూ ఎవరిని మోసం చేస్తారని ప్రతిపక్ష నేత వై.ఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు.

అసెంబ్లీ కమిటీ హాల్‌లో ప్రజెంటేషన్‌పై జగన్‌ వ్యాఖ్యలు

సాక్షి, అమరావతి: మూడేళ్లుగా రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పెట్టలేదని, అమరావతి నగర నిర్మాణమంటూ ఎవరిని మోసం చేస్తారని ప్రతిపక్ష నేత వై.ఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లు అంటూ ప్రజల్ని మోసం చేయడానికేనని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో అమరావతి నగర నిర్మాణ ప్రణాళికపై నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ ప్లాన్‌పై అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌కు విపక్ష నేత జగన్‌ హాజరు కాలేదు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జగన్‌ మాట్లాడుతూ... ఈ ప్రజంటేషన్‌కు హాజరు కాకపోవడమే మేలని, సభా సమయం మరో గంట పాటు వృ«థా తప్ప మరొకటి కాదన్నారు. ప్రజా సమస్యలు చర్చించకుండా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లు ఎందుకు అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement