మహిళా సంక్షేమమే మా లక్ష్యం: తుమ్మల | Women's welfare is my goal : THUMMALA | Sakshi
Sakshi News home page

మహిళా సంక్షేమమే మా లక్ష్యం: తుమ్మల

Jul 6 2017 1:52 AM | Updated on Sep 5 2017 3:17 PM

మహిళా సంక్షేమమే మా లక్ష్యం: తుమ్మల

మహిళా సంక్షేమమే మా లక్ష్యం: తుమ్మల

మహిళల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: మహిళల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో మహిళా ఆర్గనైజర్లు, మహిళా, శిశు సంక్షేమాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు కష్టపడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇంటింటికీ మంచినీరు సరఫరా చేస్తోందని, వచ్చే ఉగాదికల్లా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్‌ ఇస్తామని చెప్పారు. నీళ్లు ఇవ్వకుంటే ఓటు అడగబోమని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఉద్యమంలో పనిచేసిన వారిని మహిళా సంక్షేమ పథకాల పరిశీలన కోసం ఆర్గనైజర్లుగా నియమించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement