రేపే సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు | YS Jagan Visit Vijayawada Tomorrow | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ చేతుల మీదుగా నియామక పత్రాలు

Sep 29 2019 3:43 PM | Updated on Sep 29 2019 3:45 PM

YS Jagan Visit Vijayawada Tomorrow - Sakshi

'సాక్షి, అమరావతి : పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా అక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంట్లో భాగంగా రేపు ఉదయం 10:30 గంటలకు విజయవాడలోని ఎ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్లో గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛన ప్రాయంగా నియామక పత్రాలు అందిస్తారు. అనంతరం అక్కడకు వచ్చినవారి నుద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత సీఎం తిరిగి తన నివాసానికి చేరుకుంటారు. మధ్యాహ్నం ఆయన తిరుమల బయల్దేరి వెళ్తారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. రేపు సాయంత్రం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి అనంతరం బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. రేపు రాత్రి తిరుమలలోనే బసచేసి ఎల్లుండి ఉదయం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement