కోవిడ్-19 హెల్ప్‌డెస్క్‌ ప్రారంభించిన వైఎస్‌ జగన్‌ | Ys Jagan Mohanreddy inaugurates Covid19 help desk | Sakshi
Sakshi News home page

కోవిడ్-19 హెల్ప్‌డెస్క్‌ ప్రారంభించిన వైఎస్‌ జగన్‌

Published Sat, Apr 11 2020 4:26 PM | Last Updated on Sat, Apr 11 2020 7:50 PM

Ys Jagan Mohanreddy inaugurates Covid19 help desk - Sakshi

సాక్షి, తాడేపల్లి : సామాజిక మాధ్యమాల్లో కోవిడ్-19పై పూర్తి సమాచారం కోసం హెల్ప్ డెస్క్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. ఫేస్ బుక్, వాట్స్ ఆప్ ద్వారా కోవిడ్-19 సమాచారాన్ని పొందేందుకు ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. వదంతులకు తావు లేకుండా కచ్చితమైన సమాచారం కోసం సోషల్ మీడియా వేదికను ఏర్పాటు చేసింది.

వాట్స్‌ఆప్‌లో 8297104104 నెంబర్ ద్వారా, ఫేస్‌బుక్‌లో ఆరోగ్య ఆంధ్ర మెసెంజర్ ద్వారా కోవిడ్‌-19 సమాచారం పొందే అవకాశాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, హోమ్ మంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement