ప్రతిపక్ష నేత వస్తున్నాడు కాబట్టే న్యాయం జరిగింది | YS jagan mohan reddy with media garagaparru | Sakshi
Sakshi News home page

ప్రతిపక్ష నేత వస్తున్నాడు కాబట్టే న్యాయం జరిగింది

Jul 1 2017 1:00 AM | Updated on Oct 22 2018 7:26 PM

ప్రతిపక్ష నేత వస్తున్నాడు కాబట్టే న్యాయం జరిగింది - Sakshi

ప్రతిపక్ష నేత వస్తున్నాడు కాబట్టే న్యాయం జరిగింది

గరగపర్రు ఉదంతంలో ఇన్ని రోజులు చర్యలు తీసుకోకుండా ఉన్న ప్రభుత్వం ప్రతిపక్ష నేత వస్తున్నాడు కాబట్టే ప్రభుత్వం కదిలి నిందితులను అరెస్టులు చేసిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ అన్నారు.

గరగపర్రులో మీడియాతో వైఎస్‌ జగన్‌
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు:  గరగపర్రు ఉదంతంలో ఇన్ని రోజులు చర్యలు తీసుకోకుండా ఉన్న ప్రభుత్వం ప్రతిపక్ష నేత వస్తున్నాడు కాబట్టే ప్రభుత్వం కదిలి నిందితులను అరెస్టులు చేసిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ అన్నారు. ఆయన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత అన్నీ రాజకీయం చేస్తున్నారని అధికార పక్షం అంటోంది కదా అని ప్రశ్నించగా... ‘‘ప్రతిపక్ష నేత వస్తున్నాడు కాబట్టే న్యాయం జరిగింది. గ్రామంలో తలెత్తిన వివాదంపై ఇప్పటి వరకూ అరెస్టులు ఎందుకు చేయలేదు? సస్పెండ్‌లతో సరిపెట్టిన ప్రభుత్వం ప్రతిపక్ష నేత వస్తున్నాడనే భయంతో నిందితులను అరెస్టు చేసింది.

ఈ వివాదం పెద్దది కాకుండా అందరం నాలుగు అడుగులు ముందుకు వేసి సమస్యను పరిష్కరిం చాలని కోరుతున్నా’’ అని సమాధానం ఇచ్చారు. కులం పేరుతో మను షులను వేరు చేయడం అనేది సరైంది కాదని అందరం నమ్ముతున్నామన్నారు. ప్రజల్లోనూ అందరూ మంచి వాళ్లుండరు, అందరూ చెడ్డవాళ్లు ఉండరని అన్నారు. కొంతమంది చేసిన తప్పిదం వల్ల ఏదైనా ఘటన జరిగితే ఆ కొందరిపైనే చర్య తీసుకోవాలన్న డిమాండ్‌ ఇక్కడ ఉందన్నారు. గరగపర్రు గ్రామంలో సమస్య న్యాయంగా పరిష్కారం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement