వేంపల్లెలో వైఎస్ జగన్ పర్యటన | ys jagan mohan reddy tour in ysr district | Sakshi
Sakshi News home page

వేంపల్లెలో వైఎస్ జగన్ పర్యటన

Jan 30 2016 1:14 PM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్సార్ జిల్లా వేంపల్లె ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం పర్యటించారు.

వేంపల్లె: వైఎస్సార్ జిల్లా వేంపల్లె ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం పర్యటించారు. ముందుగా మండలంలోని గిడ్డంగివారిపల్లిలో దివంగత సర్పంచ్ రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు.

అనంతరం వేంపల్లెకు చేరుకుని అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ సర్పంచ్ పోతిరెడ్డి నారాయణను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే గుండెపోటుతో మృతి చెందిన సాదక్‌వలీ కుటుంబ సభ్యులను కూడా వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం ఎంపీటీసీ పద్మ, రాజ్‌కుమార్ దంపతుల మనవరాలు నామకరణ వేడుకకు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement