'బాబు వస్తాడు బంగారం విడిపిస్తాడన్నారు' | ys jagan mohan reddy slams tdp election promotion | Sakshi
Sakshi News home page

'బాబు వస్తాడు బంగారం విడిపిస్తాడన్నారు'

Aug 25 2014 12:40 PM | Updated on Jul 12 2019 6:01 PM

'బాబు వస్తాడు బంగారం విడిపిస్తాడన్నారు' - Sakshi

'బాబు వస్తాడు బంగారం విడిపిస్తాడన్నారు'

రుణమాఫీ కోసం కోటి మందిపైగా రైతులు, 70 లక్షల మంది డ్వాక్రా అక్కాచెల్లెమ్మలు ఎదురు చూస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: రుణమాఫీ కోసం కోటి మందిపైగా రైతులు, 70 లక్షల మంది డ్వాక్రా అక్కాచెల్లెమ్మలు ఎదురు చూస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని ఎన్నికల్లో టీడీపీ హామీయిచ్చిందని గుర్తు చేశారు.

ఎన్నికల ప్రచారంలో బూటకపు హామీలతో టీడీపీ నాయకులు ఊదరగొట్టారని చెప్పారు. బాబు వస్తాడు బంగారం విడిపిస్తాడని టీవీ చానళ్లలో ప్రకటనలు ఇచ్చారని గుర్తు చేశారు. డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ చేసేస్తానని ప్రతి ఎన్నికల సభలోనూ చంద్రబాబు హామీయిచ్చారని తెలిపారు.

రుణమాఫీ చేస్తామని చంద్రబాబు సంతకం చేసిన కరపత్రాలను టీడీపీ కార్యకర్తలు ఇంటింటికీ పంచారని చెప్పారు. అయితే మాట తప్పడం చంద్రబాబు అలవాటేనని ఆయన ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేస్తే తమకంటే సంతోషించేవారుండరని వైఎస్ జగన్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement