ఢిల్లీ చేరుకున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌  | YS Jagan Mohan Reddy Reached To Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీ చేరుకున్న వైఎస్‌ జగన్‌

Feb 3 2019 7:09 PM | Updated on Feb 4 2019 4:41 AM

YS Jagan Mohan Reddy Reached To Delhi - Sakshi

ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక రీతిలో అధికార తెలుగుదేశం పార్టీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతుండడం, అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను దర్వినియోగం చేస్తున్న తీరుపై వైఎస్‌ జగన్‌ సోమవారం ఉదయం 11.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. 

సర్వేల పేరుతో టీడీపీ వ్యతిరేక ఓటర్లను జాబితా నుంచి తొలిగిస్తుండడాన్ని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) సునీల్‌ అరోరా దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరనున్నారు. ఆయన వెంట వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement