అసలు జగన్ ఏం చేశాడు.... | ys jagan mohan reddy questioned tpd govenrment | Sakshi
Sakshi News home page

అసలు జగన్ ఏం చేశాడు....

Mar 10 2015 1:25 PM | Updated on Jul 25 2018 4:09 PM

అసలు జగన్ ఏం చేశాడు.... - Sakshi

అసలు జగన్ ఏం చేశాడు....

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ అన్యాయం చేసిందని ఓ వైపు టీడీపీ అసెంబ్లీలో చెబుతూనే మరోవైపు కేంద్ర ప్రభుత్వంలో ఎందుకు కొనసాగుతుందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.

హైదరాబాద్ : కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తోందని ఆరోపిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా బీజేపీతో ఎందుకు పొత్తును కొనసాగిస్తోందని  విపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మరోసారి ప్రశ్నించారు.  టీడీపీకి చేతగాక అనవసరం విపక్షంపై  ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు.  ప్రతి విషయానికి పార్టీ అధ్యక్షుడే మీడియా ముందుకు రారని...పార్టీ ప్రతినిధి కూడా మాట్లాడతారన్నారు. ఈ సంప్రదాయం అన్ని పార్టీల్లోనూ ఉందని వైఎస్ జగన్ అన్నారు.

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకు మీడియా పిచ్చి ఉంది కాబట్టే ప్రెస్మీట్ పెట్టారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. దమ్ము, ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలన్నారు. తాము ఢిల్లీ వెళితే ఆరోపణలు... చేయటం..వెళ్లకపోతే ఆరోపణలు ...అన్నిటికీ జగన్నే కారణం అనటం... మళ్లీ జగన్ పట్టించుకోవటం లేదంటూ ఆరోపణలు చేయటం ...ఇదంతా చూస్తుంటే అసలు జగన్ ఏం చేశాడంటూ ఆయన ప్రశ్నించారు

చేసింది చేసి మళ్లీ ఎంత చక్కటి డ్రామాలు ఆడుతున్నారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా టీడీపీ మంత్రులపై మండిపడ్డారు. మంత్రులు చెప్పిన అబద్ధాన్ని పదే పదే చెప్పటం చూస్తుంటే...చంద్రబాబు నాయుడుగారు మంత్రులకు ట్యూషన్లు బాగా చెబుతున్నారన్నారు. ఈ విషయంలో చంద్రబాబు గోబెల్స్ను మించిపోయారన్నారు.  

కేంద్ర మంత్రులను కూడా కలవటం తప్పుబట్టడం సరికాదని, తాను ఢిల్లీ వెళ్లి కేంద్ర నాయకులను కలిసినప్పుడు ఏదో జరిగిందని ఊహించుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కలిసినప్పుడు తాను ఏం మాట్లాడింది యనమల రామకృష్ణుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ విన్నారా అని వైఎస్ జగన్ ప్రశ్నలు సంధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement