లింగాల మండల ప్రజలతో వైఎస్‌ జగన్‌ భేటీ | ys jagan mohan reddy meets lingala mandalam villagers | Sakshi
Sakshi News home page

లింగాల మండల ప్రజలతో వైఎస్‌ జగన్‌ భేటీ

Apr 13 2017 1:56 PM | Updated on Jul 25 2018 4:42 PM

లింగాల మండల ప్రజలతో వైఎస్‌ జగన్‌ భేటీ - Sakshi

లింగాల మండల ప్రజలతో వైఎస్‌ జగన్‌ భేటీ

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస​ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం లింగాల మండలంలోని గ్రామాల ప్రజలతో సమావేశమయ్యారు.

పులివెందుల : పులివెందుల నియోజకవర్గం పర్యటనలో భాగంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస​ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం లింగాల మండలంలోని అన్ని గ్రామాల ప్రజలతో విడివిడిగా సమావేశం అయ్యారు. సాగు, తాగునీటి సమస్యలపై ఆయన  ప్రజలతో చర్చించారు. మండల ప్రజలు ఈ సందర్భంగా తమ ఇబ్బందులను వైఎస్‌ జగన్‌కు వివరించారు.

చిత్రావతి జలాశయం నుంచి తగినంత నీటిని విడుదల చేయకపోవడంతో వారానికి ఒక్కసారి కూడా నీళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఆయన వెంటనే అధికారులతో మాట్లాడారు. గ్రామాల్లో నీటి సమస్యలను తీర్చాలని వైఎస్‌ జగన్‌ అధికారులను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement